యంగ్ ట్యాలెంట్ కోసం మాయావి మాస్ట‌ర్ ప్లాన్

Update: 2021-08-15 08:30 GMT
ప‌రిశ్ర‌మ అగ్ర ద‌ర్శ‌కుడు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సొంతంగా ప్రొడ‌క్ష‌న్ కంపెనీ స్టార్ట్ చేయ‌బోతున్నారా?  అగ్ర హీరోల చిత్రాల‌తో పాటు యంగ్ ట్యాలెంట్ ని వెలుగులోకి తీసుకురావ‌డ‌మే త్రివిక్ర‌మ్ ఎజెండానా? అంటే  అవున‌నే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతో మంది అగ్ర హీరోల తో అగ్ర నిర్మాత‌ల‌తో ప‌నిచేసారు. ర‌చ‌యిత‌గా..ద‌ర్శ‌కుడిగా త‌న ట్యాలెంట్ కి ఎదురే లేదు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి అగ్ర హీరోలే వెయిటింగ్ చేస్తుంటారు. ఇండ‌స్ట్రీ టాప్ 5లో అత్యంత‌ భారీగా పారితోషికం తీసుకుంటున్న  ద‌ర్శ‌కుల్లో మాట‌ల మాంత్రికుడు ఒక‌రు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఎక్కువ‌గా హాసిని-హారికా క్రియేష‌న్స్ లోనే ఎక్కువ సినిమాలు చేసారు. అది ఆయ‌న‌కు హోమ్ బ్యాన‌ర్ లాంటింది.  

ఆ నిర్మాణ సంస్థ‌తో  ఒప్పంద ప్రాతిప‌దికన వాటాల ప్రాతిప‌దిక‌న‌ ప‌నిచేస్తున్నారు. ముందుగా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమా ద్వారా వ‌చ్చే లాభాల్లో షేర్ తీసుకుంటున్నారు. ఆ ర‌కంగా ఆ బ్యాన‌ర్ తో త్రివిక్ర‌మ్ అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. హారికా హాసిని క్రియేష‌న్స్ అధినేత రాధాకృష్ణ అలియాస్ చిన‌బాబు త్రివిక్ర‌మ్ క్లోజ్ ప్రెండ్. ఆ ర‌కంగా ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. తాజాగా త్రివిక్ర‌మ్ తానే స్వ‌యంగా  బ్యాన‌ర్ స్థాపించబోతున్న‌ట్లు స‌మాచారం. బ్యాన‌ర్ టైటిల్ ఇంకా బ‌య‌ట‌కు రాలేదు గానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమాతోనే బ్యాన‌ర్ లాంచ్ అవుతుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- రానా కాంబినేష‌న్ లో సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో `భీమ్లా నాయ‌క్ ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ బ్యాన‌ర్ పెట్టుబ‌డులు పెడుతోందిట‌. స‌హ నిర్మాత‌గా ఆయ‌న‌ బ‌రిలో ఉన్నార‌ని గుస‌గుస‌. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ క‌థ అందించ‌డంతో పాటు..ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేస్తున్నారు కాబ‌ట్టి ఆ ర‌కంగా త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ లోకి ఎంట‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. అలాగే త‌న సొంత బ్యాన‌ర్ ప్రారంభించ‌డానికి కార‌ణం వేరొక‌టి ఉంది. ఇప్ప‌టికే  కొంత మంది యువ ద‌ర్శ‌కుల‌తో కంటెంట్ బేస్డ్ లో ప‌రిమిత‌ బ‌డ్జెట్ సినిమాలు నిర్మించేలా ఒప్పందం చేసుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే స్టార్  హీరోల‌తో ఇక‌పై త్రివిక్ర‌మ్ క‌మిట్ మెంట్లు సొంత బ్యాన‌ర్లోనే ఉండే అవ‌కాశం ఉంది. అయితే ప్ర‌ధానంగా త్రివిక్ర‌మ్ బ్యాన‌ర్ స్థాపించ‌డం వెనుక కార‌ణం న‌వ‌త‌రం ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డానికే అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనిపై త్రివిక్ర‌ముడు స్వ‌యంగా వెల్ల‌డిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News