త్రివిక్రమ్.. ఇన్నాళ్లకు మనసు పెట్టాడు

Update: 2016-06-05 11:30 GMT
ఫీల్డ్ ఏదైనా సరే.. కెరీర్ ఆరంభంలోనే ఓ మాస్టర్ పీస్ పెర్ఫామెన్స్ ఇచ్చేస్తే అదే బెంచ్ మార్క్ అయిపోతుంది. తర్వాత ప్రతిసారీ అదే పెర్ఫామెన్స్ ఆశిస్తారు జనాలు. ఆ అంచనాలకు తగ్గట్లు రాణించడం కష్టమైన విషయం. త్రివిక్రమ్ విషయంలో ఇలాగే జరిగింది. దర్శకుడిగా మారాక రెండో సినిమాతోనే తనకు తాను హై లెవెల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేసుకున్నాడు త్రివిక్రమ్. ప్రతిసారీ అతడి నుంచి ‘అతడు’ లాంటి క్లాసిక్కే ఆశిస్తున్నారు జనాలు. ఐతే త్రివిక్రమ్ మాత్రం ఆ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయినా సరే.. ‘అతడు’ స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. ఇక మిగతా సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు.

ఐతే త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ ‘అఆ’ ఓ విషయంలో మాత్రం ‘అతడు’ను అందుకునే ప్రయత్నం చేసింది. అదే పాటలు.. వాటి చిత్రీకరణ. ‘అతడు’ సినిమాలో ప్రతి పాటా ప్రత్యేకంగా ఉంటుంది. సగం పాటలు కథలో ఇమిడిపోయి ఉంటాయి. అదరక బదులే చెప్పేటి.. చల్లగాలి అల్లరి.. పిలిచినా రానంటావా.. ఈ పాటలు కథతో పాటు ట్రావెల్ అవుతాయి. వీటితో పాటు మిగతా పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది.

ఐతే త్రివిక్రమ్ తర్వాతి సినిమాల్లో పాటలు అంత మనసు పెట్టి చేసినట్లుగా అనిపించవు. కాన్సెప్ట్ అంటూ ఏమీ లేకుండా చాలా వరకు డ్రీమ్ సాంగ్స్ తో లాగించేయడానికే చూశాడు త్రివిక్రమ్. ఐతే ‘అఆ’లో మాత్రం ప్రతి పాటా ప్రత్యేకమే. ఉన్న ఐదు పాటలూ కథలో భాగంగానే ఉంటాయి. సిచ్యువేషన్ కు తగ్గట్లుగా కుదిరాయి. సాహిత్యం.. సంగీతం చక్కగా కుదిరి.. చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. పూర్తి స్థాయి డ్రీమ్ సాంగ్ ఒక్కటీ లేదు. త్రివిక్రమ్ క్రియేటివిటీకి కెమెరామన్.. ఆర్ట్ డైరెక్టర్ ఇద్దరి ప్రతిభ తోడై ప్రతి పాటా కలర్ ఫుల్ గా.. ఆకర్షణీయంగా వచ్చింది. పాటొస్తే ప్రేక్షకులు లేచెళ్లి పోకుండా ఏం మిస్సయిపోతామో అని సీట్లలో కూర్చుని అన్నింటినీ ఆస్వాదిస్తుండటం విశేషం.
Tags:    

Similar News