పవన్ కళ్యాణ్ ఆజ్ఞతవాసి సినిమా తర్వాత సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాలపై పడ్డ విషయం తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో పవన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది అనుకున్నారు. అందులో ప్రధముడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సలహా మేరకు ఇప్పుడు పవన్ పింక్ రీమేక్ లో నటించేందుకు రెడీ అయ్యాడట.
పింక్ రీమేక్ రచన వ్యవహారం అంతా కూడా దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్నాడు అని.. మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత రీమేక్ బాధ్యతలు మరో దర్శకుడికి ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై గురూజీ స్పందించాడు. అల వైకుంటాపురంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన త్రివిక్రమ్ పింక్ రీమేక్ లో తన రోల్ పై క్లారిటీ ఇచ్చాడు.
మీడియాలో వస్తున్నట్లుగా పింక్ రీమేక్ కోసం తానేం రచన సహకారం అందించడం లేదు. నేను కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా చూడమని మాత్రమే సలహా ఇచ్చాను. అంతకు మించి నేను ఆ సినిమా గురించి పట్టించుకోవడం లేదని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు. అల వైకుంఠపురంలో సినిమా హిట్ టాక్ తెచుకోవడంతో త్రివిక్రమ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లయ్యింది. ఇదే జోరులో పవన్ తో కూడా ఒక సినిమా చేయండి గురూజీ అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.