మెగాస్టార్ 149.5 సినిమాతో ఎంత బూస్టు ఇచ్చినా కూడా ఆ డోస్ మాత్రం అభిమానులకు పెద్దగా సరిపోలేదు. అందుకే వారు ఎప్పుడెప్పుడు ఈయన 150వ సినిమా చేస్తారా అంటూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాని చిరంజీవి మాత్రం వేరు వేరు కార్యక్రమాల్లోపాల్గొంటున్నారే తప్పించి.. అసలు ఈ 150 అనే మాటనే మర్చిపోయినట్లున్నారు.
ఇప్పుడు కొత్తగా ఒక టాక్ వినిపిస్తోంది. ఓ రెండు రోజుల క్రితం డ్యాషింగ్ డైరక్టర్ కమ్ రైటర్ మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో.. ఫిలిం నగర్ లో ఈ కొత్త పల్లవిని వినక తప్పట్లేదు. నిజానికి ఇప్పటివరకు అసలు 150వ సినిమా అనే విషయంలో త్రివిక్రమ్ ఏమీ చెప్పకపోయినా.. ఆయన కూడా ఒక కథను మాత్రం రెడీ చేశాడట. అ..ఆ సినిమా షూటింగ్ గ్యాప్ లో మెగాస్టార్ ను కలసి ఈ కథను నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ మెగాస్టార్ జై చిరంజీవి సినిమాకు కథ రాయగా.. ఆయన థమ్సప్ యాడ్ ను డైరెక్ట్ చేశాడు. సో.. ఆ క్లోజ్ నెస్ బాగానే ఉంది వీరి మధ్యన. మరి కథ విన్న మెగాస్టార్ ఏమన్నారు??
ఆయన ఏమన్నారో తెలియదు కాని.. రోజూ అ..ఆ సినిమా పూర్తవ్వగానే తన రైటింగ్ అసోసియేట్ లతో కలసి త్రివిక్రమ్ తన పాత పంజాగుట్ట రూమ్ లో కూర్చొని స్ర్కిప్టు వర్కు చేస్తున్నారట. చూస్తుంటే.. మెగాస్టార్ ఓకె చెప్పారనే సందేహం వస్తోంది కదూ.