రామ్ చరణ్ తాజా చిత్రం 'వినయ విధేయ రామ' టీజర్ నిన్నే రిలీజ్ అయింది. బోయపాటి మీద పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఫుల్ మాస్ టీజర్ తో అందరినీ మెప్పించాడు. ఈ సినిమాకు సంగీతం అందించింది రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. మాస్ టీజర్ కు తగ్గట్టే మంచి మాస్ మసాలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు కానీ ఇప్పుడు అదే నేపథ్య సంగీతంపై సోషల్ మీడియాలో నెటిజనులు విమర్శలు మొదలు పెట్టారు.
'వినయ విధేయ రామ' టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవీ గతంలో సంగీతం అందించిన సినిమాల మ్యూజిక్ ను పోలి ఉందని.. ముఖ్యంగా 'జనతా గ్యారేజ్'.. 'శ్రీమంతుడు' సినిమాల నేపథ్య సంగీతాన్ని కాపీ కొట్టాడని మ్యూజిక్ బిట్లు పోలుస్తూ ట్విట్టర్ లో ట్రోలింగ్ మొదలు పెట్టారు. దేవీ తన సంగీతాన్ని తానే కాపీ కొట్టుకుంటాడని గతంలో కూడా విమర్శలు వచ్చాయి గానీ ఇప్పటివరకూ డీఎస్పీ ని ట్రోలింగ్ చేసిన సందర్భం లేదు. మరి ఈ ట్రోలింగ్ విషయంపై దేవీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే.. ఈ ట్రోలింగ్ తో సంబంధం లేకుండా 'వినయ విధేయ రామ' టీజర్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. సినిమా సంక్రాంతి రిలీజుకు సిద్ధం అవుతోంది. రామ్ చరణ్ లాస్ట్ సినిమా 'రంగస్థలం' ఆడియో సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు కూడా బ్లాక్ బస్టర్ ఆల్బం ఇస్తాడని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.