'ఫ్యామిలీ మ్యాన్ 2' ని బ్యాన్ చేయాలంటూ ట్రోల్స్..!

Update: 2021-05-20 02:30 GMT
దక్షిణాది అగ్ర కథానాయిక సమంత అక్కినేని డెబ్యూ వెబ్ సిరీస్ ''ది ఫ్యామిలీ మ్యాన్ 2'' ట్రైలర్ విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ‏కు ఇది సీక్వెల్. సామ్ నటించడంతో ఈ వెబ్ సిరీస్ కోసం ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఆమె డీ గ్లామర్ అండ్ నెగిటివ్ రోల్ లో.. రాజీ అనే ఉగ్రవాదిగా కనిపించనున్నారు. ‘వాళ్లందర్నీ నేను చంపేస్తా’ అంటూ తమిళ్ లో ఆమె చెప్పిన డైలాగులు, నటన ఆకట్టుకుంటున్నాయి. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అయితే 'ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ విడుదలైన తర్వాత తమిళ ప్రేక్షకుల నుంచి ఈ వెబ్ సిరీస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇందులో తమిళ టైగర్స్ ని ఉగ్రవాదులుగా చూపించారని.. ఎల్టీటీఈ ని ISIS తీవ్రవాదులతో లింక్ చేసి చూపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కావాలనే చెన్నై నేపథ్యాన్ని తీసుకొని రూపొందించిన ఈ సిరీస్ లో సామ్ యూనిఫామ్ ఎల్‌టిటిఈ కి చెందినదని అర్థం అవుతోందని.. ఇందులో నటించిందుకు తమిళ మూలాలున్న సామ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయాలని.. అమెజాన్ ప్రైమ్ వీడియోని అందరూ అన్ ఇన్స్టాల్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో '#FamilyMan2_against_Tamils' హ్యాష్ ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

'ఫ్యామిలీ మ్యాన్' తో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని అనుకున్న సమంతకు ఈ నెగిటివ్ ట్రెండ్ ఊహించని షాక్ అనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా.. ఇలాంటి నెగిటివ్ బజ్ వ్యూయర్ షిప్ ని తగ్గించే అవకాశం ఉంది. అయితే దీనిపై అమెజాన్ ప్రైమ్ - మేకర్స్ కానీ, సమంత కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇకపోతే సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది నెగెటివ్ రోల్ అని తెలిసినప్పటికీ, తాను సూపర్ ఎగ్జైట్ అయ్యానని తెలిపింది. ఒక నటిగా నెగెటివ్ రోల్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి మరింత స్కోప్ ఇచ్చిందని సమంత చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News