నేచురల్ స్టార్ నాని.. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో 'వి' సినిమా షూటింగులో ఉండగానే నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ ఫ్రెంచ్ గడ్డంలో మధ్య తరగతి కుర్రాడి పాత్రలో నాని కనిపించనున్నాడట. అంతేగాక ఈ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ జగపతి బాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు. నానిని ఇంతవరకు చూడని లుక్కులో చుపిస్తానంటున్నాడు డైరెక్టర్ శివ. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ కరోనా మహమ్మారి రావడంతో టక్ జగదీష్ కాస్త షూటింగ్ ఆపేసి కూర్చున్నాడు. హీరో నానికి నిన్నుకోరి సినిమాతో పెద్ద హిట్ అందించిన శివ నిర్వాణ రెండోసారి జతకట్టడంతో ప్రేక్షకులలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక దర్శకుడు శివ ప్రస్తుతం ‘టక్ జగదీష్’ మూవీ పనులు మెల్లగా సాగుతూనే ఉన్నాయట. వేరే సినిమాల మేకర్స్ లాగే శివ కూడా అన్నీ కుదిరితే సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే టక్ జగదీష్ 40% షూటింగ్ పూర్తయిందట. అందుకే రీ-రికార్డింగ్‌తో పాటు సినిమా ఎడిటింగ్ కూడా జరుగుతుందట. అంటే శివ టీమ్ పూర్తిగా ట్రాక్‌లో ఉందన్నమాట. మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేయడానికి ఎదురు చూస్తున్నారు. హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ టీమ్ ఆంధ్రప్రదేశ్ లో చిత్రీకరించాలని భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఏపీ అంతటా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో సెప్టెంబరులో కూడా షూటింగ్ డౌటే అంటున్నారట. మొత్తానికి టక్ జగదీష్ టీమ్ అంతా ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగుకి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.