'టక్ జగదీష్' టార్గెట్ చిన్నదే..కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కష్టమే..!

Update: 2021-03-17 03:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ''టక్ జగదీష్''. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీతూ వ‌ర్మ‌ - ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' ఓవర్ సీస్ బిజినెస్ కి సంబంధించిన ఓ న్యూస్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 

ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం 'టక్ జగదీష్' సినిమా యూఎస్ రైట్స్ 1.8 కోట్లకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 550K డాలర్ల నుండి 600K వరకు ఉండే అవకాశం ఉంది. నాని మార్కెట్ ను బట్టి చూస్తే అది చాలా ఈజీగా రీచ్ అయ్యే టార్గెట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది కాస్త కష్ట సాధ్యమని కూడా చెప్పొచ్చు. కరోనా నేపథ్యంలో అక్కడ జనాలు ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా సూపర్ గా ఉందని టాక్ వస్తేనే ఆడియన్స్ థియేటర్ వరకు వస్తున్నారు. 

ఇటీవల విడుదలైన 'ఉప్పెన' 'జాతిరత్నాలు' సినిమాలు యూఎస్ లో మంచి వసూళ్లను రాబట్టాయి. దీంతో తెలుగు సినిమా మార్కెట్ కకు హోప్ కలిగింది. రాబోయే సినిమాల్లో జనాలను థియేటర్స్ కు రప్పించగలిగే వాటిలో 'టక్ జగదీష్' ఒకటి. సినిమా బాగుందని టాక్ వస్తే నాని సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అందులోనూ శివ నిర్వాణ ముందు సినిమాలు 'నిన్ను కోరి' 'మజిలీ' అక్కడ మంచి వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు 'టక్ జగదీష్' కూడా ఆసక్తిని కలిగించే అవకాశం ఉంది. ఈఈ నేపథ్యంలో నాని సినిమా యూఎస్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News