బాలీవుడ్లో మరో విషాదం.. నటుడు సమీర్ శర్మ మృతి..కుళ్ళిన స్థితిలో ఉరికి వేలాడుతూ

Update: 2020-08-06 10:50 GMT
బాలీవుడ్ ను విషాదాలు వెంటాడుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని జనాలు ఇంకా మర్చిపోకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. నటుడు సమీర్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. కొద్ది రోజుల కిందటే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా సమీర్ శర్మ ఉరికి వేలాడుతుండటం కనిపించింది.

సమీర్ శర్మ ముంబైలోని వెస్ట్ మలద్ లో చించోలి బండర్ లోని ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నాడు. కరోనా కారణంగా షూటింగులు ఆగి పోవడంతో ఆయన ఇంటి వద్దే ఉంటున్నాడు. కాగా సమీర్ శర్మ ఉండే ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో పక్కన ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు వచ్చి చూడగా సమీర్ శర్మ ఉరివేసుకొని కనిపించాడు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో కొద్ది రోజుల కిందటే అతను చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

షూటింగులు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హసీతో ఫసీ వంటి సినిమాలతో పాటు కహానీ ఘర్ ఘర్ కీ, క్యోన్కీ సాస్ భీ కభీ బహూ థి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, జ్యోతి వంటి సీరియల్లో ఆయన నటించాడు. నటన తో పాటు మోడల్ గా కూడా కనిపించారు. బాలీవుడ్ కు 2020 సంవత్సరం కలిసి రానట్టు ఉంది. కుశాల్, పెజల్ శర్మ, అబ్దుల్లా ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సరోజ్ ఖాన్ ఇలా వరుసబెట్టి ఇప్పటికే ఒక పది మందికి పైగా బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోయారు.
Tags:    

Similar News