విరామం లేని షూటింగ్ ఆ నటి ప్రాణాల మీదకు తెచ్చింది. ‘గాంధీ బాత్’ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన ప్రముఖ హిందీ టీవీ నటి గెహానా వసిష్త్ తాజాగా ఓ వెబ్ సిరీస్ కోసం వరుసగా 48 గంటల పాటు నటిస్తూ కుప్పకూలిపోయింది. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలిసి వెంటనే ముంబైలోని రక్షా ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పుడామె పరిస్థితి సీరియస్ గా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.టైంకు సరైన పోషకాహారం తీసుకోకపోవడం.. సుదీర్ఘంగా షూటింగ్ లో పాల్గొనడం.. అసాధారణమైన పనివేళల కారణంగానే నటికి గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.
మాధ్ ద్వీపంలో వెబ్ సిరీస్ షూటింగ్ లో టీవీనటి గెహానా వసిష్త్ పాల్గొంటోంది.ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెకు గుండె పోటు వచ్చిందని ఆస్పత్రిలో చేర్చారు. పడిపోయిన బ్లడ్, షూగర్ లెవల్ కారణంగా ఆమె ఇప్పుడు వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఆమె అవయవాలు ఏవీ పనిచేయకపోవడంతో పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని వైద్యులు ప్రకటించారు.
తక్కువ రక్తపోటు, తక్కువ బ్లడ్ షుగర్ కారణంగానే గెహానాకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఆమె ఆహారం తీసుకోకుండా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం.. 48 గంటలుగా లేని నిద్ర కారణంగా శరీరంలో రక్తపోటు పడిపోవడానికి కారణమని వైద్యులు తెలిపారు. ఆమె వాడే షుగర్ మాత్రలకు , ఎనర్జీ డ్రింక్ లకు మధ్య ప్రతిచర్య జరిగి గుండెపోటుకు దారితీసిందట..
గెహానాను బతికించడానికి వైద్యులు ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చినా ఆమె శరీరం స్పందించడం లేదు. శ్వాస కూడా తీసుకోకపోవడం.. ఆమె మెదడుకు సరైన ఆక్సిజన్ అందకపోవడంతో వెంటీలేటర్ పై చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతోంది.