ఆస్టార్ యాంక‌ర్ వేగాన్ని ఆపేదెవ‌రు?

Update: 2022-06-19 23:30 GMT
`ఫేం` ఉన్నంత కాలం దున్నుకోవ‌డ‌మే ఇండ‌స్ర్టీ లో కొంత మంది లెక్క‌. అవి సినిమా అవకాశాలైనా..యాంక‌రింగ్ లో దూసుకుపోవ‌డ‌మైనా..ఇంకేదైనా స‌రే. ఆ  ఫేం కోల్పోయిన త‌ర్వాత చేసేదేమి ఉండ‌దు. వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్విన‌యోగం చేసుకుంటూ ముందుకువెళ్లిపోవ‌డం...ఆ మార్గంలో చిన్న పాటి అడ్డంకులు ఏవైనా ఎదురైతే వాటిని చాక‌చక్యంగా..తెలివిగా దాటుకుంటూ ముందెకెళ్లిపోవ‌డ‌మే.

ఇక్క‌డ అవ‌కాశం సృష్టించుకోవ‌డం ఓ ఎత్తైతే..దాన్ని నిల‌బెట్టుకోవ‌డం మ‌రో ఎత్తు. అలా మేథాత‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తేనే ఇండస్ర్టీలో నిల‌బ‌డ‌గ‌లిగేది. లేదంటే ప‌రిశ్ర‌మ‌లో ప‌ట్టించుకునేదెవ‌రు? అవేశం అన‌ర్ధానికి దారి తీస్తే..ఆలోచ‌న జీవితానికి పూల బాట వేస్తుంది. ఇండ‌స్ర్టీలో దాదాపు అంతా పాజిటివ్ యాంగిల్ లోనే ముందుకు వెళ్లిపోతారు. ఇండ‌స్ర్టీని చ‌దివేసిన ఎవ‌రికైనా ఈ విష‌యం ఇట్టే అర్ధ‌మ‌వుతుంది.

అందుకే ఇక్క‌డ‌ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లు కూడా స‌క్సెస్ అవుతుంటారు.  ర‌వి అలియాస్ బిత్తిరి స‌త్తి యాంక‌ర్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం యాంకర్ గా ర‌వి హ‌వా న‌డుస్తుంది. సాధార‌ణ‌ టీవీ యాంకర్ గా మొద‌లైన ర‌వి ప్ర‌స్థానం ఎంతో స్ఫూర్తి దాయ‌క‌మైన‌ది. ఇండ‌స్ర్టీకి నటుడ‌వ్వాల‌ని వ‌చ్చాడు. కానీ పెద్ద యాంక‌ర్ అయ్యాడు.

అత‌ని లో బిహైండ్ ట్యాలెంట్ గురించి తెలిసింది చాలా త‌క్కువ మందికే. అత‌ను మంచి రైట‌ర‌ర్. ప్రోగ్రామ్ ని డిజైన్ చేయ‌డంలో అంద వేసిన చేయి. అందుకే త‌న‌కంటూ  ఓ బిత్తిరి లిపిని క్రియేట్ చేసి త‌న‌దైన చ‌లాకీ త‌నం తో ఆక‌ట్టుకుంటున్నాడు. చిన్న హీరోల్ని ఇంటర్వ్యూల్ని చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి నేడు స్టార్ హీరోలతో చిట్ చాట్ నిర్వ‌హించే స్థాయికి ఎదిగాడు.

ప్ర‌స్తుతం టీవీ యాంక‌ర్ గా బిత్తిరి హ‌వా మామూలుగా సాగ‌లేదు. అత‌ని లేనిదే స్టార్ ఇంట‌ర్వ్యూ  లేదు అన్నంత‌గా ఫేమ‌స్ అయ్యాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బిత్తిరి ఇంట‌ర్వ్యూ త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని ఇంట‌ర్వ్యూ చేసిన సంగ‌తి  తెలిసిందే. ఆ వీడియో యూ ట్యూబ్  లో బాగా పాపుల‌ర్ అయింది. దీంతో  ర‌వి రేంజ్  పెరిగింది.

ఇప్పుడు ఒక్కో ఇంట‌ర్వ్యూకి బాగానే ఛార్జ్ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. హ‌వా సాగినంత కాలం ఎవ‌రి వేగాన్ని ఎవ‌రూ ఆప‌లేరు. ప్రస్తుతం బిత్తిరి జోరు కొన‌సాగుతోంది. అత‌ని వీడియోల‌కి మంచి వ్యూస్ వ‌స్తున్నాయి.  కొన్నాళ్ల పాటు అత‌న్ని ఆప‌డం ఆసాధ్యమే.
Tags:    

Similar News