స్టార్ హీరోల నుంచి టైర్ టు హీరోల వరకు ఏడాది ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. ఇది నిన్నటి మాట. ప్రస్తుతం మారిన సమీకరణాల కారణంగా స్టార్ హీరోల నుంచి టైర్ టు హీరోల వరకు ఒకటికి రెండు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. గతంలో మన సీనియర్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా గడిపేవారు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ షిప్ట్ అంటూ టైమ్ సెట్ చేసుకుని మరీ ఒకే రోజు మూడు నాలుగు సినిమాల షూటింగ్ ల లో పాల్గొనే వారు.
కానీ ఇప్పడు ఆ పరిస్థితులు లేకపోయినా.. ఆ రేంజ్ లో నేటి తరం హీరోలు సినిమాలు చేయలేకపోయినా రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా వుంటున్నారు. ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే మరో సినిమా ని వారాలు, నెలల వ్యవధిలోనే థియేటర్లలో వుండేలా చూసుకుంటున్నారు. ఇదే తరహాలో అక్కినేని నాగచైతన్య కూడా 20 రోజుల వ్యవధిలో తన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. ఈ ఏడాది సంక్రాంతికి `బంగార్రాజు` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం చై రెండు క్రేజీ సినిమాల్లో నటించాడు. చైతూ నటించిన లేటెస్ట్ మూవీ `థాంక్యూ`. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. వివిధ దశల్లో జరిగే ప్రేమకథల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్ లు గా నటించిన ఈ మూవీ జూలై 22 న విడుదల కాబోతోంది. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి పెద్దగా హడావిడి కనిపించడం లేదు.
సినిమా రిలీజ్ కి మరో పది రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పటికైనా పబ్లిసిటీ విషయంలో స్పీడు పెంచుతారా అని అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ తరువాత ఆగస్టు 11న బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇది చై నటించిన తొలి బాలీవుడ్ సినిమా. అయినా సరే దీని సందడి ఏ మాత్రం కనిపించడం లేదు.
బాలీవుడ్ సినిమాలకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో విడుదల కాబోతున్న `లాల్ సింగ్ చద్దా` కు తెలుగులోనూ పెద్దగా హైప్ క్రియేట్ కావడం లేదు. పబ్లిసిటీని ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. 20 రోజుల వ్యవధిలో థియేటర్లలోకి రాబోతున్న చైతూ సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట.