ప్రతీసారి క్రేజీ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుండటం కామన్. అయితే చాలా వరకు సినిమాలు అనివార్యం అయితే తప్ప పోటీ పడవు. చాలా వరకు పోటీని అవాయిడ్ చేస్తుంటాయి కూడా. ఇక స్టార్ హీరో సినిమా విడుదలైతే మరో స్టార్ సినిమా కనీసం రెండు వారాల తరువాతే థియేటర్లలోకి రావాలన్నది టాలీవుడ్ నిర్మాతలు చాలా రోజులుగా పాటిస్తున్నారు. అయితే రెండు సినిమాల విషయంలో మాత్రం పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ 'బింబిసార'. చారిత్రక నేపథ్య కథని నేటి కాలమాన పరిస్థితులకు లింకప్ చేస్తూ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందించారు. నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. టైమ్ ట్రావెల్ మూవీగా అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమాని ఆగస్టు 5న విడుదల చేయబోతున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ ఈ మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నాడట. దర్శకుడు వశిష్ట్ కి కూడా ఇది కీలకమే కావడంతో ఏ విషయంలోనూ రాజీపడటం లేదు. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించేసింది.
ఇదిలా వుంటే ఈ మూవీ సమయంలోనే నిఖిల్ 'కార్తికేయ 2' కూడా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. ముందు ఈ మూవీని జూలై 22న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే సమయంలో దిల్ రాజు 'థాంక్యూ' మూవీ రిలీజ్ వుండటంతో ఆయన రిక్వెస్ట్ కారణంగా 'కార్తికేయ 2' రిలీజ్ డేట్ ని ఆగస్టు కు మార్చేశారు. మంగళవారం రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నారు. నిఖిల్ కెరీర్ లోనే భారీ స్థాయిలో రూపొందిన సినిమా ది.
చందూ మొండేటి రూపొందించిన ఈ మూవీని 2014లో వచ్చిన 'కార్తికేయ'కు సీక్వెల్ గా చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు పోటీ పుంచి తప్పుకుని మరో రిలీజ్ డేట్ ని చూసుకుంటే మంచిదని మెజారిటీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కానీ అది కుదిరేలా కనిపించడం లేదు. కారణం జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకు వరుసగా భారీ క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
జూలై 29న మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', ఆగస్టు 11న 'లాల్ సింగ్ చద్దా', 12న విక్రమ్ 'కోబ్రా'తో పాటు నితిన్ నటించిన 'మాచర్ల నియోజక వర్గం' వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. 'కార్తికేయ 2' పోటీ నుంచి తప్పుకుంటే ఈ సినిమాలతో పోటీపడాలి. లేదంటే 'బింబిసార'తోనే పోటికి దిగాలి. ఈ రేసులో ఎవరు వెనక్కి తగ్గబోతున్నారు? .. ఎవరు నెగ్గబోతున్నారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.