మాస్ రాజా వెయిటింగ్.. అక్కడ మొదలైపోయింది

Update: 2015-12-25 09:30 GMT
బాలీవుడ్ లో రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్టయిన సినిమా ‘స్పెషల్ చబ్బీస్’. దీన్ని తెలుగులో రీమేక్ చేయడానికి రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందు నాగార్జున హీరోగా ఈ సినిమాను తెరకెక్కించడానికి ఓ నిర్మాత ట్రై చేశాడు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత తమిళ నిర్మాత - ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ‘స్పెషల్ చబ్బీస్’ సౌత్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. నాలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రూపొందించడానికి ప్రయత్నాలు సాగించాడు. తెలుగులో రవితేజను హీరోగా పెట్టుకోవాలనుకున్నాడు త్యాగరాజన్. సంప్రదింపులు కూడా జరిగాయి. ఐతే మాస్ రాజా కాదనలేదు, ఔననలేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయాలన్నాడు. ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టాడు.

ఐతే ఒకేసారి నాలుగు భాషల్లో వేర్వేరు హీరోలతో సినిమాను మొదలుపెడదామనుకున్న త్యాగరాజన్.. మిగతా భాషల సంగతి వదిలేసి తమిళం వరకు ఈ చిత్రాన్ని మొదలుపెట్టేస్తున్నాడు. తన కొడుకు ప్రశాంత్ నే హీరోగా పెట్టి ఈ సినిమా తీయబోతున్నాడు త్యాగరాజన్. తమిళ వెర్షన్ కు ‘26’ అనే టైటిల్ పెట్టాడతను.  ఇందులో సత్యరాజ్ - ప్రకాష్ రాజ్ - నాజర్ - దేవయాని - సిమ్రాన్ ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. హీరోయిన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డ్యాన్స్ చేస్తుందట. ప్రశాంత్ వరుసగా ఇలాంటి రీమేక్ లే చేస్తున్నాడు. అతను హీరోగా నటించిన ‘జులాయి’ రీమేక్  ‘సాహసం’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
Tags:    

Similar News