ఓటుకునోటులో కొత్త ట్విస్ట్

Update: 2016-10-29 07:09 GMT
తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన‌ ఓటుకు నోటు ఉదంతం మ‌రో మ‌లుపు తిరిగే అవ‌కాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు సవాల్‌ చేసిన కేసులో తనను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు.

ఏసీబీ కేసులో చంద్ర‌బాబును నిందితుడిగా చేర్చలేదని, స్టీఫెన్‌ సన్‌ తో చంద్రబాబు ఫోన్‌ లో మాట్లాడినా ఆయనను ఏసీబీ విచారించలేదని పేర్కొంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసులో ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్‌ చేసిన చంద్రబాబు విచారణపై స్టే తెచ్చుకున్నారు. దానిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో నాలుగు వారాల్లోగా ఈ కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించిన విషయమూ విదితమే. ఈ నేపథ్యంలో ఉండవల్లి తనను సైతం ప్రతివాదిగా చేర్చాలంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News