సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణరావును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ - నటులు మురళీమోహన్ - తరుణ్ పరామర్శించారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ దాసరి నారాయణరావు వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి వచ్చానని వివరించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నాని, ఆయన కుటుంబసభ్యులతోనూ మాట్లాడానని వివరించారు. దాసరి త్వరలో కోలుకుని ఇంటికి వెళతారని ఆశిస్తున్నానన్నాని దత్తాత్రేయ వివరించారు.
ఇదిలాఉండగా... దాసరిని పరామర్శించిన అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. దాసరిని పలకరించానని - ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా వరకు మెరుగుపడిందని అన్నారు. దాసరికి వైద్యులు వెంటిలేటర్ తొలగించారని - దాసరి బాగుంటేనే సినీ పరిశ్రమ బాగుంటుందని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ రేపు ఫిలింనగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/