ఆగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ఆహా ఓటీటీ కోసం 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో సెకండ్ సీజన్ ఇటీవలే మొదలై అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటూ మరింత వైరల్ గా మారింది. సీజన్ 2లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో గోపీచంద్ కలిసి పాల్గొన్నారు. వీరికి సంబంధించిన పార్ట్ 2 ఎపిసోడ్ తాగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, గోపీచంద్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
తమ ఇద్దరి మధ్య వున్న స్నేహ బంధం గురించి కొత్త విషయాల్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. '2008లో మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవ పడ్డారని విన్నాం. ఇంతకీ ఎవరా హీరోయిన్? అని బాలకృష్ణ ప్రశ్నించారు.
గోపీచంద్ మాట్లాడుతూ నిజమే సార్ కానీ 2008లో కాదు 2004లో. 'వర్షం' సినిమాలో త్రిష కోసం ఇద్దరం గొడవ పడ్డాం' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. గోపీచంద్ టైమింగ్ కి ఫిదా అయిన ప్రభాస్ వెంటనే 'మా వాడు సూపర్ గా సమాధానం చెప్పాడు' అని అక్కడ నవ్వులు పూయించాడు.
అంతే కాకుండా తనకు సినిమాలు చూడటం, ఒంటరిగా షాపింగ్స్ చేయడం ఇష్టమని చెప్పిన ప్రభాస్ తనతో ఎవరు వచ్చినా నచ్చదని అంటూనే నయనతార, తమన్నా లను మాత్రం షాపింగ్ కు తీసుకెళతానని కామెడీ చేశాడు. అంతేనా ఒకవేళ దీపికా పదుకునే, సమంత సముద్రంలో పడిపోతే తాను మాత్రం దీపికా పదుకునేనే కాపాడతానని, ఎందుకంటే తను లేకపోతే 'ప్రాజెక్ట్ కె' ఆగిపోతుందని సరదాగా కామెడీ చేశాడు. ఇక మరిన్ని విశేషాలు తెలియజేస్తూ 'బాహుబలి' తరువాత తనపై ఒత్తిడి బాగా పెరిగిందన్నాడు.
'బాహుబలి' తరువాత ఏం చేయాలి, దేశంలో అందరికి నచ్చేలా ఎలాంటి సినిమా చేయాలి?.. కమర్షియల్ సినిమా చేయాలా? లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలా?.. ఒక వేళ అలా చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? ..ఇలా ఎంతో గందరగోళంగా వుండేదన్నాడు. ఎందుకంటే 'బాహుబలి'తో అన్ని రాష్ట్రాల్లో మాకు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులను అలరించడం కోసం కష్టపడుతున్నా. ఒత్తిడి చాలా ఎక్కువగానే వుంది' అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
వెంటనే గోపీచంద్ అందుకుని 'ఒత్తిడిలో వున్నప్పుడు ప్రభాస్ వేరే ప్రపంచంలో వుంటాడని, ఎందుకు ఇంతలా ఒత్తిడి తీసుకుంటున్నాడా? అని అనిపిస్తుందని గోపీచంద్ తెలిపాడు. ఆ తరువాత రీసెంట్ గా చనిపోయిన పెదనాన్న కృష్ణంరాజు ని గుర్తు చేసుకుని ప్రభాస్ భావోద్వేగానికి లోనయ్యాడు. 'భక్తకన్నప్ప' చూసి తాను కూడా ఆర్టిస్ట్ కావాలనుకున్నానని, మొదట ఈ విషయాన్ని కజిన్ ప్రమోద్ కు తెలిపానని ప్రభాస్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.