టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు అంతర్జాతీయ స్థాయి అవార్డు గోల్డెన్ గ్లోబ్ దక్కడం తో మొత్తం ఇండియన్ సినీ ప్రేక్షకులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ సమయంలో సినిమా యూనిట్ సభ్యుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏ స్థాయిలో ఆనందంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
నాటు నాటు పాటలో డాన్స్ చేసిన రామ్ చరణ్ యొక్క భార్య ఉపాసన తన యొక్క ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఉపాసన కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో సందడి చేసిన విషయం తెల్సిందే. ఆమె చీర కట్టు లో నుదిట బొట్టు పెట్టుకుని అత్యంత ఆకర్షణీయంగా నిలిచారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో హాజరు అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో.. ఆర్ ఆర్ ఆర్ యొక్క ఫ్యామిలీలో ఒక పార్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. ఇండియన్ సినిమా అవార్డు దక్కించుకోవడం గర్వంగా ఉంది.. జై హింద్.. రామ్ చరణ్ మరియు రాజమౌళి గారికి ఈ జర్నీ లో నన్ను ఒక పార్ట్ గా చేసినందుకు కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన జర్నీ ని నా పుట్టబోయే బేబీ కూడా ఎంజాయ్ చేసి ఉంటుంది అన్నట్లుగా ఉపాసన పేర్కొంది. తాను ఈ సమయంలో చాలా ఎమోషనల్ గా ఉన్నాను అన్నట్లుగా పేర్కొంది.
ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెల్సిందే. అయినా కూడా అరుదైన సమయం అవ్వడంతో అమెరికాకు ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి వెళ్లి గోల్డెన్ గ్లోబ్ వేడుకలో పాల్గొన్నారు. గర్భవతిగా ఉండి ఉపాసన మరింత అందంగా కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.