మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో కోలీవుడ్ మూవీ కత్తిని.. కత్తిలాంటోడు అనే టైటిల్ పై రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ చిత్రానికి నిర్మాత.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్. మామగారు చిరంజీవి హీరో - భర్త రామ్ చరణ్ నిర్మాత కావడం.. చెర్రీ స్టార్ట్ చేసిన కొణిదెల బ్యానర్ పై తొలి మూవీ కావడంతో.. ఈ మూవీ సక్సెస్ ని ఉపాసన సెంటిమెంట్ గా భావిస్తోంది.
చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ రామ్ చరణ్ భార్య ఉపాసన.. అన్నవరంలో వ్రతం చేయడం విశేషం. ఏప్రిల్ 30న కొంతమంది అభిమానులతో కలిసి అన్నవరం వెళ్లిన ఉపాసనకు.. అక్కడ దేవాలయ అధికారుల నుంచి సాదర స్వాగతం లభించింది. ఆ తర్వాత అన్నవరం సత్యదేవునికి ఉపాసన ప్రత్యేక పూజలు చేసి.. తన భర్త నిర్మాతగా చేస్తున్న తొలి మూవీ సక్సెస్ పై ప్రార్ధించింది.
మెగాస్టార్ మూవీ సక్సెస్ కోసం ఇప్పటికే అభిమానులు చాలాచోట్ల ప్రత్యేక పూజలు చేసేయడం చూస్తూనే ఉన్నాం కానీ.. ఇప్పుడు కోడలు ఉపాసన కూడా ఇలాంటి స్పెషల్ పూజలు చేయడం.. అందరికీ ఆసక్తి కలిగించింది. ఈ కార్యక్రమాన్ని ఆమె వ్యక్తిగతంగానే భావించినా.. ఆమె వెంట మెగా అభిమానులు కూడా ఉండడంతో.. మెగా ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచింది.