అసలు అఖిల్ అండ్ శ్రీయ భూపాల్ మధ్యన ఏం జరిగింది? వీరు నిజంగానే విడిపోయారా? అన్నేసి మీడియాల్లో వీరి పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని న్యూస్ వస్తుంటే.. అసలు పబ్లిక్ ఈవెంట్లకు వస్తున్న అమల కాని.. ట్విట్టర్లో యమా యాక్టివ్ గా ఉండే నాగార్జున అండ్ సమంత కాని.. ఇదే ఫ్యామిలీకి దగ్గరవారైన ఇతర సెలబ్రిటీలు కాని నోరు మెదపట్లేదు. కాని ఒక సెలబ్రిటీ మాత్రం.. తానే రంగంలోకి దిగి మ్యాటర్ సెటిల్ చేస్తోందా? పదండి చూద్దాం.
హైదరాబాద్ హై సొసైటీలో పెద్దలగా పేరొందిన వారిలో.. అందరికంటే అపోలో ఫ్యామిలీ వారే చాలా టాప్. అందుకే వారికి అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. పైగా అపోలో వారు.. ఇటు జివికె వారు.. అందరూ ఒకటే కమ్యూనిటీకి చెందినవారు. అందుకే చిన్నప్పటి నుండీ ఈ ఫ్యామిలీలలో ప్రతీ ఒక్కరితోనూ ఉపాసన కామినేనికి చాలా దగ్గర అనుబంధం ఉందంట. మరో ప్రక్కన చూస్తే అఖిల్ ఎవరో కాదు.. చిరంజీవికి బిజినెస్ పార్టనర్ అండ్ చిరకాల మిత్రుడు అయిన నాగార్జున కొడుకు. అందుకే రామ్ చరణ్ భార్య ఉపాసన ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి.. అఖిల్ అండ్ శ్రీయ మధ్యన సయోధ్య కుదిర్చే క్రమంలో ఉన్నట్లు ఒక టాక్ వినిపిస్తోంది. ఉపాసన మీడియేట్ చేయడంతో వీరు కూడా వివాదాలను పరిష్కరించుకునే దశలో ఉన్నారని అంటున్నారు. తమకు బాగా కావల్సిన రెండు ఫ్యామిలీలకు చెందిన పిల్లలు ఇలా విడిపోవడం చూడలేక.. ఉపాసన బంధువులు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారట.
అసలు ఈ మొత్తం యవ్వారం నిజమో కాదో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం సోషల్ సర్క్యూట్లలో ఈ పాయింట్ చాలా హాటుగా వినిపిస్తోంది. ఒకవేళ వీరి మధ్యన సయోధ్య కుదిరి.. అనుకున్న డేటుకే పెళ్ళి జరిగితే మాత్రం.. అది ఉపాసన టాలెంట్ అనే చెప్పుకోవాలేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/