తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనమంటే కొంత మంది సెలబ్రిటీలు ఎంత హడావుడి చేస్తారో చెప్పాల్సిన పనిలేదు. వీవీఐపీ దర్శనం.. స్వామి వారి పాదాల్ని నేరుగా తాకే వెసులుబాటు ఇలాంటి సౌకర్యాలు ముందుగానే ఏర్పాటు చేసుకుని దైవ దర్శనానికి బయలు దేరుతారు. అంతకు ముందు వాళ్ల వ్యక్తిగత సిబ్బంది...పర్సనల్ స్టాప్ ఇలా హడావుడి చాలానే ఉంటుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకుని వస్తోన్న ఓ వీడియో వైరల్ గా మారింది. ఉపాసన తో పాటు మరో ఇద్దరు.. ముగ్గురు మాత్రమే ఆమె వెంట ఉన్నారు.
ఉపాసన చాలా సింపుల్ గా ఎలాంటి వ్యక్తిగత.. రక్షణ సిబ్బంది లేకుండా దైవ దర్శనం ముగించుకున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముఖానికి మాస్క్ వేసుకుని.. శానిటైజ్ చేసుకుని నేరుగా గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఉపాసన వెంట అభిమానుల అనవసర హంగామా ఏదీ పడలేదు. తాను కోరుకున్న డీసెన్సీ అక్కడ వీలుపడింది. కొంత మంది భక్తులు దూరంగా నుంచి చూసి గుర్తు పట్టినా.. వాళ్లను చిరు నవ్వుతో ఉపాసన పలకరించారు.
ఈసారికి ఉపాసాన ఒక్కరే ఇలా సింగిల్ గా దర్శనానికి వెళ్లారు... గతంలో ఓసారి కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చారు. అప్పుడు చరణ్ ఉన్నారు. చిరంజీవి-సురేఖ దంపతులు కూడా వారి వెంట ఉన్నారు. అలాగే శ్రీకాళ హస్తిలో రాహుకేతు పూజల్లోనూ చరణ్ దంపతులు పాల్గొన్నారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా చరణ్ దంపతులు పూజలు నిర్వహించారు. ఉపాసన దైవభక్తి పైనా సింప్లిసిటీ పైనా గతంలో మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.