ఏఎంబీ మాల్ లో బిగ్ రిలీజెస్

Update: 2018-12-19 05:03 GMT
ఏఎంబీ మాల్ సునామీలా దూసుకొచ్చింది. ప్ర‌పంచంలోనే రిచెస్ట్ థియేట‌ర్ల‌లో ఒక‌టిగా దీనిని అభివ‌ర్ణిస్తున్నారు.  అక్క‌డ యాంబియెన్స్ అంత రిచ్‌ గా ఉంది. అయితే అంద‌రికీ ఉన్న‌ట్టే చిన్నా చిత‌కా స‌మ‌స్య‌లు ఈ మాల్ లోనూ ఉన్నాయి. ముఖ్యంగా పార్కింగ్ స‌మ‌స్య గురించి ప‌దే ప‌దే జ‌నం ఫిర్యాదు చేయ‌డం ఇబ్బందే. అయితే దానిని యాజ‌మాన్యం ప‌రిష్క‌రించే ఆలోచన చేస్తోంద‌ట‌.

అదంతా అటుంచితే ఏఎంబీలో ఏడు స్క్రీన్ల‌లో నిరాఠంకంగా ప‌డుతున్న సినిమాలు హౌస్ ఫుల్స్ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ మేర‌కు గ‌చ్చిబౌళి - కొత్త‌గూడ‌కు ట్రాఫిక్ పెరిగింద‌ని చెబుతున్నారు. అలాగే `2.ఓ` చిత్రంతో ముహూర్తం పెట్టారు కాబ‌ట్టి అది బాగానే క‌లిసొస్తోంది. ఇటీవ‌లి క్రేజీ సినిమాల‌న్నీ అందులో రిలీజ‌య్యాయి. 3డి సినిమాల‌న్నీ ఏఎంబీ మాల్ కి క్యూ క‌డుతున్నాయి. దీంతో జ‌నం బాగానే త‌ర‌లి వ‌స్తున్నారు. వీలున్న‌ప్పుడ‌ల్లా న‌మ్ర‌త మ‌హేష్ ప‌దే ప‌దే మాల్‌ కి సంబంధించిన ఫోటోల్ని లీక్ చేస్తూ వేడి పెంచేస్తున్నారు. ఇందులో ఫ్రీషోలు - సెల‌బ్రిటీ షోలు అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తున్నారు.

ఇక ఈ మాల్ లో వ‌రుస‌గా క్రేజీ సినిమాల ధ‌మాకా మోగ‌నుంది. ఈ శుక్ర‌వారం నాలుగు క్రేజీ సినిమాలు బ‌రిలో దిగుతున్నాయి. అంత‌రిక్షం - ప‌డి ప‌డి లేచే మ‌న‌సు - కె.జి.ఎఫ్‌ - మారి 2 వంటి చిత్రాలు ఏఎంబీ స్క్రీన్ల‌లో బంతాడ బోతున్నాయి. అటుపైనా సంక్రాంతి రేసులో అన్ని క్రేజీ సినిమాలు ఏఎంబీ మాల్ లో అభిమానుల‌కు అందుబాటులోకి రానున్నాయి. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు - విన‌య విధేయ రామా - ఎఫ్ 2- ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ - పెట్టా చిత్రాలు ఇక్క‌డ కూడా సంద‌డి చేయ‌నున్నాయి. ఖ‌రీదైన రిక్లెయిన‌ర్‌ లో హాయిగా జార‌బ‌డి 360 డిగ్రీలు తిరిగేస్తూ పాప్ కార్న్ తిని కోక్ తాగేస్తూ చూడొచ్చ‌న్న‌మాట‌. అయితే టిక్కెట్టుకు రూ.250 నుంచి రూ.400 వ‌ర‌కూ ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది రెండున్న‌ర గంట‌ల వినోదానికి.
   

Tags:    

Similar News