టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్లపై గత కొన్ని రోజులుగా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటిలాగే భారీ పోటీ నెలకొంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు జనవరి 12 న రిలీజ్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' సంక్రాంతి సీజన్ అంటున్నా ప్రస్తుతం ఉన్న పోటీ చూస్తే ఒక వారం వెనక్కు జరిగేలా ఉందని అంటున్నారు.
ఇక సంక్రాంతి పెద్ద సినిమాల డేట్లు ఫిక్స్ అయ్యాయి కాబట్టి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్ డేట్లు కూడా ఫిక్స్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' డిసెంబర్ 20 న రిలీజ్ అవుతోంది. రవితేజ 'డిస్కోరాజా'.. నితిన్ 'భీష్మ' సినిమాలు క్రిస్మస్ సీజన్ లో విడుదల చేస్తారని వార్తలు మొదట్లో వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. 'డిస్కోరాజా' రిపబ్లిక్ డే నాడు.. 'భీష్మ' వ్యాలెంటైన్ డేకి ఫిక్స్ అయ్యారని అంటున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల -నాగచైతన్య సినిమాను మొదట క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూట్ డిలే కావడంతో వ్యాలెంటైన్ డే నాడు రిలీజ్ చేయాలని ప్లాన్ మార్చుకున్నారట. దీంతో క్రిస్మస్ సీజన్ పోటీ కాస్త తగ్గినట్టే.
ఇక సీనియర్ స్టార్ల సినిమాల విషయానికి వస్తే బాలయ్య సినిమా 'రూలర్' షూటింగ్ ప్రారంభించినప్పుడు సంక్రాంతి రిలీజ్ ఉండొచ్చనే అంచనాలు వెలువడ్డాయి కానీ ఇప్పుడు 'రూలర్' క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేసే విషయంలో ఆలోచిస్తున్నారట. డిసెంబర్ 20 లేదా 25 న ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు. మరోవైపు వెంకటేష్ - నాగచైతన్యల మల్టిస్టారర్ 'వెంకీమామ' డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సంక్రాంతి బరిలో నిలపాలని ఆలోచనలో సురేష్ బాబు ఉన్నారని ఒక టాక్ ఉంది. అయితే ఈ సినిమాను డిసెంబర్ కు షిఫ్ట్ చేయించాలని సంక్రాంతి సినిమాల నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.