సూప‌ర్ స్టార్ కోసం మ‌రొక‌రు కావాల‌ట‌!

Update: 2022-07-30 23:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ ప్రాజెక్ట్ SSMB28. ప‌ర‌శురామ్ తో చేసిన 'స‌ర్కారు వారి పాట‌' ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ SSMB28 కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. గ‌త కొంత కాలంగా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని మ‌హేష్ నుంచి ఆశిస్తున్న అభిమానులు ఈ ప్రాజెక్ట్ తో ఆ కోరిక తీరుతుంద‌ని ఆశాభావిన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌రుశురామ్‌, మైత్రీ, 14 ప్ల‌స్ రీల్స్ క‌లిసి చేసినా సినిమా కూడా ఆశించిన స్థాయిలో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ఈ సారి త్రివిక్ర‌మ్ తో చేయ‌బోతున్న సినిమాతో ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌ని కోరుకుంటున్నారు.  

'స‌ర్కారు వారి పాట‌' త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో మహేష్ ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 'ఖ‌లేజా' త‌రువాత దాదాపు 12 ఏళ్ల విరామం అనంత‌రం మ‌ళ్లీ ఇద్ద‌రు క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్ర‌త్యేకంగా చూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే.

త‌మ‌న్ సంగీతం అందించ‌నున్న ఈ మూవీని ఆ మ‌ధ్య పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభించారు. కానీ ఇంత వ‌ర‌కు రెగ్యుల‌ర్ షూటింగ్ ప‌ట్టాలెక్క‌లేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఆగ‌స్టు రెండ‌వ వారం నుంచి ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే మేక‌ర్స్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కు సినిమా రిలీజ్ చేయ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌రమైన అప్ డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఈ మూవీలో మ‌హేష్ కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఇందులో పూజాతో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఇందు కోసం ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్ ల పేర్లు వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

'పెళ్లిసంద‌D' ఫేమ్ శ్రీ‌లీలా, ఇటీవల 'భీమ్లానాయ‌క్‌'తో తెలుగులో ప‌రిచ‌య‌మైన సంయుక్త మీన‌న్ ల పేర్లు వినిపించాయి. అయితే వీళ్లె కాకుండా క్రేజీ యంగ్ హీరోయిన్ కోసం త్రివిక్ర‌మ్ వెతుకుతున్నార‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఏ.ఎస్‌. ప్ర‌కాష్‌, సినిమాటోగ్రాఫ‌ర్ గా పీఎస్ వినోద్‌, ఎడిటిర్ గా న‌వీన్ నూలి వ‌ర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News