అనుకున్నదే అయ్యింది.. 'ఏజెంట్‌' మళ్లీ అదే తీరు

Update: 2022-11-29 05:24 GMT
అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ ప్రస్తుతం చేస్తున్న ఏజెంట్‌ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం క్రియేట్‌ అవుతోంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ ఏడాది ఆగస్టులోనే సినిమాను విడుదల చేయాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు ఇతర కారణాల వల్ల అక్టోబర్.. డిసెంబర్‌ అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు.

ఆ మధ్య కచ్చితంగా సంక్రాంతికి విడుదల చేసి తీరుతాం అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రకటించాడు. అయితే సంక్రాంతికి చిరంజీవి మరియు బాలయ్య ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. కనుక సంక్రాంతికి ఏజెంట్‌ రావడం ఏమాత్రం సరి కాదు.. సబబు కాదు అంటూ అక్కినేని ఫ్యాన్స్ మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంక్రాంతికి ఏజెంట్‌ రావడం లేదని దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. అయితే కొత్త విడుదల తేది ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఏజెంట్‌ కొత్త విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఒక క్లారిటీ వచ్చింది. మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఏజెంట్‌ సినిమాను తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఏజెంట్‌ సినిమాను మార్చి మూడవ లేదా నాల్గవ వారంలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఉగాది కానుకగా ఏజెంట్‌ విడుదల చేయడం ద్వారా పండుగ సెలవులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సమ్మర్ హాలీడేస్ లో ఏజెంట్‌ సందడి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఏజెంట్‌ సినిమా లో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ నటిస్తున్నాడు. షూటింగ్‌ సమయంలోనే అంచనాలు భారీగా పెరిగాయి. కొన్ని సన్నివేశాలను రీ షూట్‌ చేశారనే ప్రచారం జరిగింది. ఆ విషయమై క్లారిటీ లేదు కానీ అఖిల్‌ కెరీర్ లోనే ఇదో బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ మూవీగా నిలువబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News