రావణాసుర టీజర్ డేట్ లాక్

Update: 2023-03-02 09:39 GMT
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావణాసుర. రవితేజ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఈ మూవీ ఉంది. ఇక ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్న రవితేజ ఈ మూవీతో మరో హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు.

సుదీర్ వర్మ లాంటి టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం కావడంతో కచ్చితంగా థ్రిల్లింగ్ అంశాలు మూవీలో ఉంటాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్ కి తాజాగా చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.

 మార్చి 6 ఉదయం 10:08 గంటలకి ఈ మూవీ టీజర్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.  ఇదిలా ఉంటే సుదీర్ వర్మ కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే అయినా కచ్చితంగా కొత్త పాయింట్ మాత్రం ఉండేలా చూసుకుంటారు. అలాంటి దర్శకుడితో రావణాసుర లాంటి పవర్ ఫుల్ టైటిల్ తో రవితేజ లాంటి మాస్ హీరో సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా యునిక్ కాన్సెప్ట్ తోనే ఈ మూవీ వస్తూ ఉండొచ్చు అని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు వంద కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకోవాలని రవితేజ చూస్తున్నారు. ఇక ఈ మూవీకి రైటర్ గా వెంకీ మామ, నెక్స్ట్ నువ్వే, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, డెవిల్, కిలాడీ సినిమాలకి పనిచేసిన శ్రీకాంత్ వెస్స  కథ అందించడం విశేషం. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ అలాగే ధమాకాతో అదిరిపోయే సాంగ్స్ ఇచ్చిన బీమ్స్  ఈ మూవీకి సంగీతం అందిస్తూ ఉన్నారు.

అలాగే నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ తో రావణాసుర సిద్ధం అయ్యింది.  ఇక టాలెంటెడ్ కెమెరామెన్ కార్తీక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇలా టాలెంటెడ్ టీమ్ మొత్తం కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్ అద్బుతంగా వచ్చిందని తెలుస్తుంది.

ఇక ఈ మూవీలో సుశాంత్ విలన్ గా నటిస్తూ ఉండటం విశేషం. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశం, ఫరియా అబ్దులా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో ఇంటరెస్టింగ్ రోల్ లో దాక్షా నగార్కర్ కూడా కనిపించబోతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News