తేజ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలిగా..!

Update: 2022-11-15 06:30 GMT
క్రియేటివ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. విభిన్న నేపథ్యాలతో అనేక ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడాయన. ఈ క్రమంలో ఎందరో ప్రతిభావంతులైన నూతన నటీనటులను సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఉదయ్ కిరణ్ - నితిన్ - సదా - అనిత - రీమాసేన్ - నవదీప్ - ఆది పినిశెట్టి - ప్రిన్స్ - అనూప్ రూబెన్స్ వంటి ఎంతో మందిని తేజ ఇంట్రడ్యూస్ చేశారు. ఎంతోమంది హీరో హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టారు. ఇప్పటికీ దర్శకుడు తన సినిమాలతో న్యూ టాలెంట్ ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

తేజ ఇప్పుడు ''అహింస'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రెండో కుమారుడు, హ్యాండ్సమ్ హంక్ రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి అహింసా సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తిని హింస కలిసినప్పుడు ఏమి జరుగుతుంది అనే పాయింట్ తో తేజ మార్క్ లవ్ స్టొరీగా ''అహింస'' సినిమా రూపొందిందని తెలుస్తోంది.

ఇందులో అభిరామ్ ఒక యువ రైతుగా డీగ్లామర్ గా కనిపించాడు. 'అహింస' సినిమా కోసం దగ్గుబాటి వారసుడు బాగానే కష్టపడ్డాడని చెబుతున్నారు. ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండేలా సన్నివేశాలను చిత్రీకరించే తేజ కారణంగా అభి కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడ్డాడట.

తేజ తాను అనుకున్న సీన్ అనుకున్న విధంగా వచ్చే వరకు టేకుల మీద టేకులు తీస్తూనే ఉంటారని అంటుంటారు. అంతేకాదు ఈ క్రమంలో న‌టీన‌టుల‌పై చేయి చేసుకుంటారని చెబుతారు. ఈ విషయాన్ని దర్శకుడు సైతం పలు ఇంటర్వ్యూలలో అంగీకరించారు. అయితే అదంతా సినిమా కోసమే అని తేజ అంటుంటారు.

'నువ్వు నేను' అనిత - ఉద‌య్ కిర‌ణ్‌ - సదా - కాజ‌ల్‌ అగర్వాల్ - న‌వ‌దీప్‌.. ఇలా అనేకమంది యాక్టర్స్ తేజతో చెంప దెబ్బ‌లు తిన్నారని చెబుతారు. ఇప్పుడు 'అహింస' సినిమాలో అభిరామ్ కి కూడా దర్శకుడి దెబ్బలు రుచి చూపించారని రూమర్స్ ఉన్నాయి.

సినిమాలో ఓ కీలకమైన సన్నివేశంలో న‌టించ‌డానికి అభిరామ్ చాలా ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌. ఎన్ని టేకులు చేసినా ఆ సీన్ సరిగ్గా రాకపోయే సరికి తేజ తన చేతికి పని చెప్పాడట. ఆ తర్వాత ఆ ఎమోషనల్ సీన్ బాగా వచ్చిందట.

తేజ ఇప్పటి వరకూ కొత్తవారిపై చేయి చేసుకోవడం వేరు. కానీ ఇక్కడ అగ్ర నిర్మాత కొడుకుపై సెట్లో చేసుకున్నాడని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ.. తేజ సినిమా అంటే ఆమాత్రం ఉంటుందిగా అని ఫిలిం సర్కిల్స్ లో వ్యాఖ్యానిస్తున్నారు.  

దర్శకుడు తెరకెక్కించే ప్ర‌తీ సినిమాలోనూ ఒక‌రిద్ద‌రికి చేతిలో దెబ్బ‌లు త‌ప్ప‌వని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉంది. సురేష్ బాబుకు ఈ విషయం తెలియంది కాదు. అందులోనూ తేజతో రానా హీరోగా హోమ్ బ్యానర్ లో 'నేనే రాజు నేనే మంత్రి' వంటి చిత్రాన్ని రూపొందించారు కూడా.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలనే తేజ చేతిలో పెట్టాలని నిర్ణయించుకొని ఉంటారు. అందుకే ఒక పక్కా కమర్షియల్ మూవీతో తనయుడిని లాంచ్ చేయకుండా తేజ శైలి వైవిధ్యమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి అభిరామ్ హీరోగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News