తేరి రీమేక్.. కథలో తేడా ఏమిటంటే?

Update: 2022-12-11 13:30 GMT
మాస్ కమర్షియల్ దర్శకుడు శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎప్పటినుంచో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అతను ఇదివరకే భవదీయుడు భగత్ సింగ్ అనే కథను ఫైనల్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకో మళ్ళీ ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.

ఇక ఫైనల్గా తేరి సినిమాను రీమేక్ చేయాలి అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే హరీష్ శంకర్ దగ్గర ఒరిజినల్ స్టోరీలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సలహా మేరకే ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ దర్శకుడు దాదాపు మూడేళ్ల నుంచి మరో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ఇక ఈ సినిమా ఛాన్స్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని వెంటనే మళ్ళీ పట్టాలు ఎక్కించాలి అని ఫిక్స్ అయ్యాడు. అయితే విజయ్ నటించిన తమిళ మూవీ తేరి సినిమా కథకు కొన్ని మార్పులు చేస్తున్నారు అనేది కూడా కొంత ఆసక్తిని కలిగిస్తోంది.

ఇటీవల అందిన సమాచారం ప్రకారం అయితే తేరి సినిమా విజయ్ క్యారెక్టర్ ఒక బేకరీ ఓనర్ గా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కథలో మాత్రం ఒక కాలేజీ లెక్చరర్ గా కనిపిస్తాడు అని తెలుస్తోంది. ఇదివరకే హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ లో పవన్ క్యారెక్టర్ ను లెక్చరర్ పాత్రలో అనుకున్నాడు. అయితే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్రైజేషన్ ను తేరి కథలోకి షిఫ్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

హరిష్ శంకర్ కు రీమేక్ కదలను తెరపైకి తీసుకురావడంలో మంచి అనుభవం ఉంది. ఇంతకుముందు దబాంగ్ సినిమా కథలో కూడా అలాంటి మార్పులు చేసి సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు కూడా హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను తనదైన శైలిలో చూపించడానికి స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ కథపై చాలా నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News