మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను ఏప్రిల్ 2 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుండి ఫస్ట్ వేవ్ అంటూ హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లో వైష్ణవ్ ప్రింటెడ్ కలర్స్ ఉన్న షర్టు.. గ్రే కలర్ ప్యాంట్ ధరించి సముద్రపు నీటి లో నిలుచున్నాడు. ఓ పెద్ద అల వైష్ణవ్ వైపుగా వస్తూ ఉంటే రెండు చేతులను చాపి.. పిడికిళ్లు బిగించి మరీ ఎదుర్కొన్నట్టుగా నిలబడడం విశేషం. సముద్రపు అలల నేపథ్యం తో పోస్టర్ ఆకర్షణీయం గా ఉంది. ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీ అని ఇప్పటికే టాక్ ఉంది. వైష్ణవ్ తేజ్ పోస్టర్ కూడా దానికి తగ్గట్టు గానే ఉంది.
Full View
ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. బుచ్చిబాబు సాన దర్శకుడు. నవీన్ ఎర్నేని.. రవి శంకర్ ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.