కొన్ని సినిమాలు మాత్రమే అటు థియోటర్ లోనూ ఇటు ఓటీటి, బుల్లి తెరపైనా దుమ్ము రేపుతూంటాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో చేరింది ఉప్పెన.తమ సినిమాపై నమ్మకంతో లాక్ డౌన్ టైమ్ లో ఎన్ని ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కాదనుకుని, తొమ్మిదినెలల పాటు వాయిదా వేసి.. థియేటర్స్ లో రిలీజైంది ఈ సినిమా. టైమ్ బాగుంది 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ దొరికింది.దాంతో ఆ టైమ్ లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నిర్మాతలు. అయితే ఓటీటిలో మాత్రం ఆ స్దాయి క్రేజ్ మాత్రం రాలేదు. దాంతో బుల్లితెరపై ఈ సినిమా పరిస్దితి ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ ఇప్పుడు బుల్లితెర మీద కూడా సూపర్ హిట్ టీఆర్పీ తెచ్చుకుంది.
ఉప్పెన బుల్లితెర మీద స్టార్ మా లో ఏప్రిల్18 ఆదివారం సాయంత్రం ప్రసారం చేసారు. జెమిని ఛానల్ లో విజయ్ - విజయ్ సేతుపతిల మాస్టర్ సినిమా కి పోటీగా. అయితే విజయ్ మాస్టర్ కి కేవలం 4.5 టీఆర్పీ జెమిని ఛానల్ కి రాగా.. ఉప్పెన ప్రసారం అయిన స్టార్ మా కి 18.5 టీఆర్పీ రావడం నిజంగా గొప్ప విషయంగానే చెప్పాలి. థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద కుడా ఉప్పొంగిన ఉప్పెన గా ఉప్పెన సినిమా భారీ టీఆర్పీ తో రికార్డు సృష్టించిందంటున్నారు.
బుచ్చిబాబు సన దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ను సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఇంత విజయం సాధించడానికి సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించింది అని చెప్పాలి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. థియేటర్స్ లో 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని నిర్మాతలకి కట్టబెట్టిన ఉప్పెన మూవీ బుల్లితెర మీద స్టార్ మా కి అదిరిపోయే టీఆర్పీ తెచ్చిపెట్టిందని గర్వంగా చెప్పుకుంటున్నారు.