ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటింగ్ సినిమాగా మారింది ఉప్పెన. ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. అయితే ఉప్పెన మూవీ విడుదలకు ముందే మ్యూజికల్ రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నీకన్ను నీలి సముద్రం పాట యావత్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఆ పాటతో ఉప్పెన పై మరింత ఆసక్తిని పెంచేసాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.
మరి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఉప్పెన ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే చేసిందట. నిజానికి తక్కువ బడ్జెట్ లో సినిమాను తీయాలనీ అనుకున్నారట. కానీ అనుకున్నదానికి మించి నిర్మాతలు ఖర్చుపెట్టారని సమాచారం. పది కోట్లలో కంప్లీట్ చేయాలనుకుంటే ఉప్పెన బడ్జెట్ 17కోట్లు దాటిందని సినీవర్గాల అంచనా.
అయితే సినిమా బిజినెస్ కూడా గట్టిగానే పెరిగిందట. ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఉప్పెన నైజాం హక్కులు 6కోట్లు, సీడెడ్ హక్కులు 3కోట్లవరకు పలుకగా.. ఆంధ్రాలో 10కోట్ల వరకు బిజినెస్ చేసిందట. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉప్పెన 19 కోట్లవరకు బిజినెస్ చేసిందని టాక్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 20.5కోట్ల బిజినెస్ చేస్తుండడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లకు సెట్ అయ్యిందట.
ప్రస్తుతం క్రేజ్ తో ఉప్పెన 21కోట్లు కొట్టడం మాములే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ టార్గెట్ అందుకుంటే మాత్రం అధిక వసూళ్లు అందుకున్న ఫస్ట్ డెబ్యూ హీరోగా వైష్ణవ్ పేరు నిలుస్తుందట. నిజానికి మధ్యలో ఉప్పెనకు చాలానే ఓటిటి ఆఫర్స్ వచ్చాయట. గతంలో ఓటీటీలో ఆఫర్స్ వచ్చినా వైష్ణవ్ ఫస్ట్ సినిమా అని థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్ణయంతో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.