సినీ ఇండస్ట్రీలో షార్ట్ ఫిలింస్ లేటెస్ట్ ట్రెండ్. వ్యాపార రంగంలో స్టార్టప్ లది నయా హవా. ఈ రెండింటినీ మిక్స్ చేసి.. ఓ స్టార్ హీరోయిన్ తో యాక్ట్ చేయిస్తే ఎలా ఉంటుంది ? అన్నీ కలిస్తే అదుర్స్ అనిపిస్తోంది కదూ. అర్బన్ లేడర్ అనే స్టార్టప్ అదే చేసింది. బ్యూటిఫుల్ భామ తాప్సీ పన్నుతో ది హోమ్ కమింగ్ అనే ఓ షార్ట్ ఫిలిం చేసింది. నిజానికి ఇది కమర్షియల్ అయినా.. షార్ట్ ఫిలింలో మాత్రం అలాంటి ఎలిమెంట్స్ లేకుండా.. హ్యుమన్ టచ్ సూపర్బ్ గా ఇచ్చారు.
ది హోమ్ కమింగ్ లో.. అందరూ బాగానే చేసినా తాప్సీ పన్ను యాక్టింగ్ నే ముఖ్యంగా చెప్పుకోవాలి. తాము కట్టుకున్న ఇంటిని.. అత్త, మామలకు అనుకూలంగా మార్చాలని భర్తకు సలహా ఇవ్వడం బాగుంది. చివర్లో సొంతిల్లులా అనిపించింది అన్న మామగారితో.. అయితే మాతోనే కలిసి ఉండడి అని అడగడం అద్భుతంగా ఉంది.
ఫీలింగ్స్, యాక్టింగ్ విషయంలో తాప్సీ బాగా మెచ్యూర్ అయింది. ది హోమ్ కమింగ్ షార్ట్ ఫిలింలో కీలకమైన కోడలి పాత్రను అద్భుతంగా పోషించిందీ భామ. దివాలీ విషెస్ చెబ్తూ తీసిన ఈ షార్ట్ ఫిలిం.. కమర్షియల్, ఫ్యామిలీ యాంగిల్స్ లోనూ ఆకట్టుకునేలా ఉండడం విశేషం.