ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటేలా. మోడల్ గా తన సత్తా చాటిన ఆమె తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటం.. గ్లామర్ డోసుతో యూత్ ను విపరీతంగా ఆకర్షించిన ఆమె.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. 2015లో మిస్ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆమె.. బాలీవుడ్ లో అడుగు పెట్టిన కొద్ది కాలానికే పాపులార్టీని సొంతం చేసుకుంది.
ఇటీవల నటించిన ఒక తమిళ్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
తనకు వచ్చిన పెళ్లి ప్రపోజల్స్ గురించి వివరించింది. ఈ సందర్భంగా తనకు ఎలాంటి వ్యక్తి కావాలన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేసింది.ఇంటర్వ్యూలో భాగంగా మీకు ఇబ్బందికరమైన పెళ్లి ప్రపోజల్ వచ్చిందా? అని అడిగినప్పుడు షాకయ్యే సమాధానాన్ని చెప్పుకొచ్చింది.
తనకు చాలానే పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని.. అందులో ఇబ్బందికరమైన ప్రపోజల్ ఒకటి ఉందని చెప్పింది. దుబాయ్ లో ఈజిఫ్టుకు చెందిన ఒక స్టార్ పాప్ సింగర్ ను కలిశానని.. అతను పెళ్లి చేసుకుంటావా? అని అడిగినట్లు చెప్పింది. అప్పటికే అతనికి దుబాయ్ లో ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పింది.
అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం మన కల్చర్ కు.. సంప్రదాయానికి విరుద్దమన్న ఆమె.. కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా? అంటూ తనకెలాంటి ప్రపోజల్ ఇష్టమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.
ఊర్వశీ నోటి నుంచి వచ్చిన ఈ సమాధానంతో నెటిజన్ ఒకరు.. సదరు ఈజిప్టు పాప్ సింగర్ పేరును పట్టేశాడు. నిజానికి ఆమె అతని పేరు చెప్పకున్నా.. ఆమె ఇచ్చిన ఆధారాలతో అతని పేరు మహ్మద్ రమదాన్ అని.. 2021లో విడుదలైన వెర్సాస్ బేబీ అనే మ్యూజిక్ వీడియోలో ఈజిప్షియన్ యాక్టర్.. సింగర్ అయిన అతనితో కలిసి ఒక వీడియో చేసినట్లుగా వెల్లడించారు.
సో.. ఊర్వశీ చెప్పిన వివరాలకు ఇతనికి మ్యాచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో.. పెళ్లి ప్రపోజల్ చేసిన సెలబ్రిటీ ఇతనే అన్న మాట వినిపిస్తోంది.