ఉస్తాద్ గా వస్తానంటున్న బాలయ్య

Update: 2017-05-22 07:02 GMT
పూరీ జగన్నాధ్ సినిమాలు.. అందులో హీరో పాత్రల కంటే.. ముందు ఈ దర్శకుడు పెట్టే టైటిల్స్ వెరైటీగా ఉంటాయి. తిట్లనే టైటిల్స్ గా పెట్టేందుకు ఉత్సాహం చూపుతుంటాడు పూరీ. లేదా నెగిటివ్ ఎసెన్స్ అయినా టైటిల్ లో తగులుతూ ఉంటుంది. ఇప్పటివరకూ ఇది బాగానే చెల్లుబాటు అయింది కానీ.. నందమూరి బాలకృష్ణ విషయంలో మాత్రం పూరీ డెసిషన్ నెగ్గేలా కనిపించడం లేదు.

బాలయ్య నటిస్తున్న 101వ చిత్రానికి టైటిల్ పై ఇంకా సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. ఈ చిత్రానికి 'టపోరి'.. 'చకోరి' టైటిల్స్ ను ఫిక్స్ చేయాలన్నది పూరీ ఆలోచన. ఇప్పటికీ వీటికే మొగ్గుతున్నాడు కానీ.. బాలకృష్ణ సినిమాల టైటిల్స్ సహజంగా హీరోయిజం ఉట్టిపడేలా ఉంటాయి. కానీ పూరీ చెబుతున్న టైటిల్స్ మాత్రం నెగిటివ్ గా ఉంటాయి. డిక్టేటర్.. లెజెండ్ వంటి పవర్ ఫుల్ టైటిల్స్ కోసం చూస్తున్న బాలయ్య.. ఇప్పటికే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

'గ్యాంగ్ స్టర్'.. 'ఉస్తాద్' అనే టైటిల్స్ బాలయ్య పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. కానీ గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ డిక్టేటర్ కు దగ్గరగా ఉండడంతో.. ఉస్తాద్ వైపే బాలయ్య మొగ్గుతున్నారని తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒక టైటిల్ ఎంచుకునే బాధ్యత మాత్రం పూరీ చేతిలోనే పెట్టినట్లు తెలుస్తోంది. మరి పవర్ ఫుల్ టైటిల్ గా పూరీ ఏ టైటిల్ ఎంచుకుంటాడో చూడాలి. శాతకర్ణి తర్వాత వరుసగా బాలయ్యతో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.
Tags:    

Similar News