సైరాకు అన్ని అడ్డంకులు క్లియ‌రైన‌ట్టేనా?

Update: 2019-09-26 07:42 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన సైరా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డం-హిందీలో ప్రీమియ‌ర్ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా క‌ర్నూలుకు చెందిన తొలి ఫ్రీడంఫైట‌ర్ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని నెల‌లుగా ఉయ్యాల‌వాడ చిత్రానికి ఏవో అడ్డంకులు వ‌స్తూనే ఉన్నాయి.

సైరా రిలీజ్ ని ఆపాల్సిందిగా ఉయ్యాల‌వాడ కుటుంబీకులం అంటూ కొంద‌రు డైరెక్టుగా చిరంజీవి ఇంటి ముందే గొడ‌వ‌కు దిగ‌డంతో అది కాస్తా సంచ‌ల‌న‌మైంది. దాదాపు 50 కోట్ల మేర చెల్లిస్తామ‌ని చిత్ర‌నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ఒప్పందం చేసుకోవ‌డం వ‌ల్ల‌నే ఉయ్యాల‌వాడ క‌థ‌ను .. క‌ర్నూలులో ఆయ‌న నివాసం ఉన్న ఇంటిని ప్రాప‌ర్టీల్ని చిత్రీక‌ర‌ణ‌కు ఉప‌యోగించుకునేందుకు ఇచ్చామ‌ని చెబుతున్నారు. ఆ క్ర‌మంలోనే ఈ వివాదానికి కార‌కులైన వారు కాకుండా మ‌రికొంద‌రు ఉయ్యాల‌వాడ వార‌సులు హైద‌రాబాద్ లో చిరంజీవిని క‌లిసి క‌ర్నూలు కుందు న‌ది స‌మీపంలోని జూర్రూరు ప‌రిస‌రాల్లో రూపంగుడి (ఉయ్యాల‌వాడ మండ‌లం) వ‌ద్ద న‌ర‌సింహారెడ్డి స్మార‌క స్తూపాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించ‌డం ఆసక్తిని రేకెత్తించింది. దీంతో కొణిదెల టీమ్ తో ఉయ్యాల‌వాడ కుటుంబీకుల‌కు ఉన్న స‌మ‌స్య ప‌రిష్కారం అయిన‌ట్టేన‌ని భావించారు. అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం వీళ్లు వేరు.. వాళ్లు వేరు.

ఉయ్యాల‌వాడ గ్రామానికి చెందిన దొర‌వారి ద‌స్త‌గిరి రెడ్డి అనే ఆసామి ఆయ‌న‌తో పాటు కొంద‌రు నాలుగో జ‌న‌రేష‌న్ వార‌సులు సైరా నిర్మాత‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిందిగా కోరుతూ వీరు పిటీష‌న్ ని దాఖ‌లు చేశారు. ఈ సినిమా ప్రివ్యూని త‌మ‌కు చూపించాల‌ని అఫిడ‌విట్ లో కోరారు. ``గ‌త ఆగ‌స్టులో చ‌ర‌ణ్ ని క‌లిసాం. సినిమాకి ఖ‌ర్చు చేస్తున్న‌ బ‌డ్జెట్ పై 10 శాతాన్ని రాయ‌ల్టీగా చెల్లిస్తామ‌ని రామ్ చ‌ర‌ణ్ ఒప్పుకున్నారు. ఆరంభం ఖ‌ర్చుల కోసం రూ.25వేలు ఇచ్చారు. అయితే ఆ త‌ర్వాత మాత్రం మాట మార్చారు`` అంటూ కోర్టులో నివేదించారు. సైరా నిర్మాత స‌హా కొంద‌రు సినిమా యూనిట్ స‌భ్యులు త‌మ‌ ఫోన్లు తీయ‌డం మానేశార‌ని ఆరోపించారు. నేడు(గురువారం) ఈ వ్య‌వ‌హారంపై తీర్పు వెలువ‌డ‌నుంద‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News