ఫోటో స్టొరీ: బికినీ తాళం.. అందాల రాగం

Update: 2019-07-27 06:19 GMT
హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి వాణి కపూర్ పేరు తెలిసే ఉంటుంది.  'శుద్ద్ దేశి రొమాన్స్'..  'బేఫిక్రే' లాంటి సినిమాలలో ఘాటుగా నటించి బోల్డ్ భామ ట్యాగ్ ను సాధించింది.  'బేఫిక్రే' హిట్ కాలేదు కానీ రణవీర్ సింగ్ తో పోటీపడి రచ్చరచ్చగా నటించి.. లెక్కలేనన్ని లిప్పులాకులిచ్చి యూత్ కు కిక్కిచ్చింది. ఈ భామ అప్పుడెప్పుడో నాని సినిమా 'ఆహా కళ్యాణం' లో కూడా హీరోయిన్ గా నటించింది.   ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్. ఫోటోలు పోస్ట్ చేస్తే రోజుల తరబడి నెటిజన్లు వాటి గురించి చర్చలు సాగించాల్సిందే.

తాజాగా ఈ భామ మరోసారి తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు "గోల్డెన్ అవర్ లోకి వెళ్తున్నాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఈ క్యాప్షన్ కు అర్థం అయిన వాళ్ళు అర్థం చేసుకోండి.. అర్థం కానివాళ్ళు ఎక్కువ కష్టపడకుండా వదిలేయండి.  యమా స్టైలిష్ గా పింక్ బికినీ ధరించి స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్స్ ను పట్టుకొని ఒక ఫోటోలో పోజిచ్చింది. రెండవ ఫోటోను సైడ్ యాంగిల్ లో క్లోజప్ షాట్ తీయడంతో పాప అందాలను పది రెట్లు ఎక్కువగా భూతద్దంలో చూసినట్టుగా ఉంది.  బూతద్దం కాదు నాయనలారా... భూతద్దం.. అందుకే ఎప్పుడూ నానో టెక్నాలజీ.. ఎఐ.. ఐవోటీ ల మీద ఫోకస్ చేయడమే కాకుండా కాస్త తెలుగుమీద కూడా శ్రద్ధ పెడితే మేలు.   ఇక భూతద్దం తెలీదు.. IoT కూడా తెలియదు అంటారా.. భేష్.. ఇక ఎలాంటి సమస్యా లేదు. ఇవన్నీ పక్కనపెడితే వాణి అందాలు మగ నెటిజన్ల హృదయవీణలను మీటడం మాత్రం ఖాయం.

ఇలాంటి శుద్ద్ దేశి బికినీకి కామెంట్లు రాకుండా ఎలా ఉంటాయి? "ఇత్నీ హాట్ నెస్.. కైసా.. కైసా?".. "ఇదీ బికినీ వార్".. "కిల్లర్ పోజ్.. స్టన్నింగ్ బ్యూటీ" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక సినిమాల విషయానికి వస్తే వాణి ప్రస్తుతం హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ ల మల్టి స్టారర్ చిత్రం 'వార్' లో హీరోయిన్ గా నటిస్తోంది.  భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను యష్ రాజ్ ఫైల్మ్స్ వారు నిర్మించారు.  ఈ సినిమా విజయంపై వాణి భారీగా నమ్మకం పెట్టుకుంది.


Tags:    

Similar News