ఫ్యాషనిస్టా అనే పదానికి నిర్వచనం ఈ బ్యూటీ. అందాల రాణిగా కిరీటం అదుకుని మోడల్ గా కెరీర్ ఆరంభించింది. అటుపై యష్ రాజ్ బ్యానర్ అండదండలతో సినీనాయికగా మనుగడ సాగిస్తోంది. ఇప్పటికిప్పుడు దాదాపు 1000 కోట్ల విలువ చేసే భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఈ ఏడాది అత్యంత భారీగా ఆదాయం ఆర్జిస్తున్న నటిగానూ వెలిగిపోతోంది. బాలీవుడ్ లో ఎందరు అగ్ర హీరోయిన్లు ఉన్నా తనకంటూ ఒక స్థానం ఉందని నిరూపిస్తోంది. ఇంతకీ ఎవరీ సుందరి?అంటే.. ది గ్రేట్ వాణీ కపూర్.
అసలు వాణీ కపూర్ పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆహాకల్యాణం చిత్రంలో నటించింది. నాని సరసన ఈ బ్యూటీ నటించినా సరైన హిట్ అందుకోలేకపోయినా బాలీవుడ్ లో మాత్రం తన రేంజు ఎక్కడా తగ్గలేదు. ఇటీవల పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ యష్ రాజ్ బ్యానర్ లో వరుస చిత్రాల్ని చేస్తోంది.
ఇంతకుముందు యష్ రాజ్ బ్యానర్ లోనే వార్ చిత్రంలో హృతిక్ సరసన నటించిన వాణీ కపూర్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. బాలీవుడ్ లో ఆరంగేట్రమే `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో విజయం అందుకుని `బేఫికరే`..చిత్రంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ నటిగా మారింది.
వాణీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో వాణీ ఇన్ స్టా వేదికగా టచ్ లో ఉంది. తాజాగా వాణీ సమ్మర్ స్పెషల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటో షూట్ లో వాణీ కపూర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రకరకాల ఫ్యాషన్స్ స్టైలింగ్ ని అనుకరిస్తూ చూపరుల మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే అమ్మడు నటించిన `బెల్ బాటమ్` రిలీజ్ అయింది. అక్షయ్ సరసన నటించిన ఈ సినిమా కరోనా క్రైసిస్ లో రావడంతో ఆశించనంతగా రాణించలేదు. ప్రస్తుతం కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బడ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్..సంజయ్ దత్ హీరోలగా నటిస్తున్నారు.
అలాగే అభిషేక్ కపూర్ దర్శకత్వంలో `చండీఘర్ కరే ఆశీకిల్` లో నటిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ప్రభాస్ సలార్ లోనూ వాణీ విలన్ గ్యాంగ్ లో కనిపిస్తుందని టాక్ వచ్చింది. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.
Full View