ఫోటో స్టోరీ: ర్యాంప్ ను రఫ్ఫాడించింది

Update: 2019-10-13 07:24 GMT
బాలీవుడ్ భామ వాణి కపూర్ ఇప్పుడు 'వార్' విజయంతో ఫుల్ జోష్ లో ఉంది.  గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినా కానీ ఈ భామకు ఇప్పటివరకూ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.  నిజానికి 'బెఫిక్రే' సినిమాలో వాణి యాక్టింగ్ ఎలా ఉంటుందంటే బోల్డ్ హీరోయిన్ కు రూల్ బుక్. అయితే ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీ కొట్టింది లెండి.  నిజానికి వాణి బెఫిక్రే యాక్టింగ్ ను 'బోల్డ్ హీరోయిన్ ఎలా ఉండాలి?' అనే సబ్జెక్ట్ గా బీకామ్ సిలబస్ లో చేర్చవచ్చు.  ఏం.. ఫిజిక్సును జోడిస్తే ఊరుకుంటారు కానీ బోల్డ్ యాక్టింగ్ సబ్జెక్ట్ కు ఒప్పుకోరా?

సరే.. న్యూ జనరేషన్ అన్న తర్వాత న్యూ సబ్జెక్టులు క్వైట్ కామన్. అయితే ఇవన్నీ కాకుండా ఫ్యాషన్.. ర్యాంప్ వాక్ అనే ఓల్డ్ సబ్జెక్ట్ కూడా ఉంది.  వాణి కపూర్ ర్యాంప్ వాక్ పై నడిచి హొయలుపోవడంలో కూడా దిట్ట.  రీసెంట్ గా ముంబైలో ప్రముఖ డిజైనర్ పాయల్ సింఘాల్ ఫ్యాషన్ షో జరిగింది.  ఇక డిజైనర్ డ్రెస్సులో వాణి ర్యాంపును రఫ్ఫాడించిందంటే నమ్మండి.  సహజంగా ఎక్కువమంది హైలెవెల్ మోడల్స్ కరువుకాటకాలు విలయ తాండవం చేసే ప్రాంతం నుంచి వచ్చినట్టుగా ఎముకలు కనిపించేలా ఉంటారు. ఫేస్ ఎక్స్ ప్రెషన్ లేకుండా ఉంటుంది.. తెలుపు రంగులో మాత్రం ఉంటారు.  అంతే.  కానీ వాణి మాత్రం పర్ఫెక్ట్ షేప్ లో.. ఫేస్ లో ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో.. గ్రేస్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టింది.

బేసిక్ గా నటి కాబట్టి మోడలింగ్ కు ఎక్స్ ప్రెషన్ ను కూడా జోడించింది.  నిజానికి ర్యాంపు వాకులు చేసేవాళ్ళు వాణి నుంచి ఇది తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశం. ఫేస్ లో ఆ నవ్వు లేకపోతే రోబోకు లేడీకి తేడా ఏముంటుంది? సరే ఇలాంటి మెట్టవేదాంతాలు పక్కన పెట్టి వాణి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'షంషేరా' అనే సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాలో సంజయ్ దత్.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Tags:    

Similar News