చార్ట్ బస్టర్ సాంగ్ అంటూ సంగీత దర్శకులు .. లిరిసిస్టులు ప్రస్థావిస్తుంటారు. ఆల్బమ్ లో ఫలానా పాట చార్ట్ బస్టర్ అని ప్రత్యేకించి గుర్తు చేస్తుంటారు. ఇటీవల అలాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఏం ఉన్నాయి? అని వెతికితే .. చాలా పరిమితంగా మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఓ రెండు గీతాలు మాత్రం చార్ట్ బస్టర్లను మించి యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించడం ఇటీవల ప్రముఖంగా చర్చకు వచ్చింది.
ఆ రెండూ సాయిపల్లవి పాటలే. వాటిలో సాయిపల్లవి- వరుణ్ తేజ్ జంటపై తెరకెక్కించిన `వచ్చిండే పిల్లా..` (ఫిదా) సాంగ్ ఎంత పెద్ద చార్ట్ బస్టరో తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ లో రిలీజైంది మొదలు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ దూసుకుపోతూనే ఉంది. ఇప్పటికి 20 కోట్ల (200 మిలియన్లు) మంది ఈ పాటను యూట్యూబ్ లో వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు. శక్తి కాంత్ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్.. గాయనీమణుల ప్రతిభ.. సాయిపల్లవి అద్భుత నాట్య విన్యాసం- ఎక్స్ ప్రెషన్స్ వెరసి ఈ పాటను ఇంతటి చార్ట్ బస్టర్ ని చేశాయనే చెప్పొచ్చు.
ఆసక్తికరంగా ఇటీవలే రిలీజైన సాయిపల్లవి `రౌడీ బేబి..` సాంగ్ సైతం 20 కోట్ల వ్యూస్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. ఆ పాటలోనూ సాయి పల్లవి అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్స్ యూత్ ని ఓ ఊపు ఊపేశాయి. మాస్ హీరో ధనుష్ తో కలిసి సాయిపల్లవి ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇక వచ్చిండే పిల్ల సాంగ్ లో సాయిపల్లవి ఎంత హుషారైన స్టెప్పులు వేసిందో.. వరుణ్ తేజ్ అంతే క్లాస్సీ ఎక్స్ ప్రెషన్స్ తో మగువల్ని మురిపించాడు. సౌత్ లో ఏ పెళ్లి జరిగిన ఈ పాటతో డెక్ మోతెక్కిపోవాల్సిందే. అందుకే ఈ గీతం ఇప్పటికీ యూట్యూబ్.. సామాజిక మాధ్యమాల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ స్థాయి రీచ్ ఇటీవలి కాలంలో ఏ ఇతర గీతాలకు రాలేదంటే అతిశయోక్తి కాదు.