తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. `వై దిస్ కోలావెరి` అంటూ ప్రపంచాన్ని ఊపేసిన ధనుష్...`షమితాబ్`,` రాంఝనా`వంటి చిత్రాలతో బాలీవుడ్ లో అడుగుపెట్టి సత్తా చాటాడు. `ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆప్ ది ఫకీర్`తో హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. తాను ఎంచుకునే కథల విషయంలో ఎంతో జాగ్రత్త వహించే ధనుష్....తాజాగా `వడ చెన్నై` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విలక్షణ కథలను తెరకెక్కించే దర్శకుడు వెట్రిమారన్....ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో గతంలో వచ్చిన `ఆడుగాలం`(తెలుగులో పందెంకోళ్లు)సినిమా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా, విడుదలైన `వడ చెన్నై` చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది.
ఏడేళ్ల క్రితం `ఆడుగాలం` చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఈ కాంబో లో రాబోతోన్న `వడ చెన్నై`పై కోలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని....ఇందులో రెండు మూడు గెటప్స్ లో కనిపించేందుకు ప్రయత్నించానని ధనుష్ అన్నాడు. ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ధనుష్ చెప్పినట్లుగానే...ఆ పాత్రలలో అతడు ఒదిగిపోయాడు. ఉత్తర చెన్నైలో ఆవారాగా తిరిగే ఓ యువకుడి పాత్రలో నటించిన ధనుష్...ఐశ్వర్యా రాజేష్ తో లిప్ లాక్ సీన్ లో అంతే రొమాంటిగా కనిపించాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా గ్యాంగ్ స్టర్ గా మారిన ధనుష్....రఫ్ లుక్ లో ఇరగదీశాడు. ``ఒక్కడి చావుతో ఈ యుద్ధం ఆగదు....గెలుపైనా ఓటమైనా...యుద్ధం చేయక తప్పదు....మనం ప్రతిఘటించకపోతే....వారు మనల్ని అణగదొక్కుతూనే ఉంటారు......ఇది మన ఊరు....గుడిసెలైనా...చెత్త కుప్పలైనా....వాటిని కాపాడుకోవడం కోసం మనం పోరాడాల్సిందే....``అని ధనుష్ సింపుల్ గా చెప్పిన డైలాగ్స్...చాలా పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సహజత్వానికి, వాస్తవికతకు దగ్గరగా చిత్రాలు రూపొందిస్తారని పేరున్న వెట్రిమారన్....ఆ అంచనాలకు తగ్గట్లే `వడ చెన్నై` ను రూపొందిస్తున్నారని టీజర్ ను బట్టి అర్థమవుతోంది. తాజాగా విడుదలైన టీజర్ ఈ చిత్రంపై అంచనాలను పెంచిందనడంలో సందేహం లేదు.
Full View