ప్రపంచంలో సినిమా కంటే ప్రమాదకరమైన వ్యాపారం మరొకటి ఉండదన్నది తెలిసే చాలామంది సినిమాల మీద పెట్టుబడి పెడుతుంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత దారుణంగా ఉంటుందో నిర్మాతలకు తెలియంది కాదు. అలాంటపుడు పెట్టుబడి పెట్టడానికి ముందే ఓసారి ఆలోచించుకోవాలి. బాగాలేని సినిమాలు తీసి తర్వాత ఆ సినిమాల గురించి నెగెటివ్‌గా రివ్యూలు రాసిన వాళ్లను ఆడిపోసుకుంటే ఏం లాభం? టాలీవుడ్‌లో ఈ మధ్య రివ్యూయర్లను తిట్టిపోసే సంస్కృతి ఊపందుకుంటోంది.
ఐతే తమిళనాట రివ్యూయర్లు చాలా కఠినంగా ఉంటారు. సినిమా ఏమాత్రం తేడా వచ్చినా.. దారుణంగా ఉంటాయి అక్కడి రివ్యూలు. అయినప్పటికీ అక్కడి సినీ జనాలు రివ్యూయర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం తక్కువే. ఐతే ఈ మధ్య అక్కడ కూడా రివ్యూయర్లకు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా వడివేలు రివ్యూయర్లపై యుద్ధం ప్రకటించారు. తన కొత్త సినిమా 'ఎలి' గురించి నెగెటివ్‌గా రాసిన రివ్యూయర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వడివేలు.
''ఎలి సినిమాకు సంబంధించి ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. విడుదలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటినీ అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. సినిమా జనాలకు బాగానే నచ్చింది. చాలామంది పాజిటివ్ రివ్యూలు రాశారు. కానీ కొంతమందికి ఏమైందో తెలియదు. చాలా నెగెటివ్‌గా రాశారు. వాళ్ల వెనక ఎవరో ఉన్నారు. బహుశా వాళ్లను ఎలుకేమైనా (ఎలి అంటే ఎలుక అని అర్థం) కరిచిందో ఏమింటో. ఇలాంటి రివ్యూలు రాసిన వాళ్లు సైకోలు, శాడిస్టులు'' అన్నారు వడివేలు.
ఐతే 'ఎలి' సినిమా నిజంగానే బాలేదన్నది జనాల మాట. ఎక్కువమంది రివ్యూయర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా బాగున్నా ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ రివ్యూలు రాసేవాళ్లను తిట్టడంలో తప్పు లేదు కానీ.. చాలా సందర్భాల్లో దీనికి విరుద్ధంగానే జరుగుతోంది. అంత కష్టపడ్డాం.. ఇంత కష్టపడ్డాం.. అంటారు కానీ.. కష్టపడ్డారు కదా అని సినిమా సూపర్ అని చెప్పి రాసి జనాల్ని మోసం చేయడం సబబేనా అన్నది కూడా ఆలోచించాలి కదా.