‘ఉప్పెన’ సినిమా మొదలైనపుడు ఏమో అనుకున్నారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా కూడా మరీ అంచనాలేమీ లేవు. సినిమా పట్ల జనాల్లో ఆసక్తి కనిపించింది కానీ.. కరోనా కారణంగా పది నెలలకు విడుదల కోసం ఎదురు చూసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ ప్రేమకథ ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడీ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందు అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి. సంక్రాంతి సినిమాలు సహా అన్నీ బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గించేయడం, కనీస పోటీ కూడా లేకపోవడం, రిలీజ్ రోజు పాజిటివ్ టాక్ రావడంతో ‘ఉప్పెన’కు ఎదురే లేకుండా పోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ప్యాక్డ్ హౌసెస్‌తో నడుస్తోంది. తొలి రోజు ‘ఉప్పెన’ సాధించిన వసూళ్లు ఇప్పుడు ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఏకంగా రూ.10.43 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది ‘ఉప్పెన’. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.9.3 కోట్ల షేర్ రావడం విశేషం. నైజాంలో షేర్ రూ.3 కోట్లు దాటిపోగా.. సీడెడ్లో రూ.1.3 కోట్లు వచ్చాయి. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.5 కోట్ల దాకా షేర్ కొల్లగొట్టిందీ చిత్రం.
మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి రూ.కోటికి పైగానే షేర్ వచ్చింది. కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు అనూహ్యం. తెలుగులో ఓ డెబ్యూ హీరో నటించిన సినిమాకు వచ్చిన అత్యధిక షేర్ ఇదే కావడం విశేషం. ఇప్పటిదాకా టాలీవుడ్లో ఓ కొత్త హీరో సినిమా తొలి రోజు సాధించిన హైయెస్ట్ షేర్ అంటే.. రూ.7.4 కోట్లు. అది అక్కినేని వారసుడు అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’కు వచ్చిన షేర్. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ప్రి రిలీజ్ హైప్‌తో భారీగా తొలి రోజు వసూళ్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. కానీ రెండో రోజు నుంచి సినిమా అడ్రస్ లేకుండా పోయింది. కానీ ‘ఉప్పెన’ అలా కాదు. తొలి రోజే ‘అఖిల్’ సినిమాను మించి రూ.3 కోట్ల పైగానే షేర్ రాబట్టిన ఈ చిత్రం తర్వాతి రెండు రోజుల్లోనూ భారీగా షేర్ రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూడు రోజుల్లోనే షేర్ రూ.25 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదేమో.