మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఒక్కసారిగా స్టార్ డం దక్కించుకున్నాడు. మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నాడు. చాలా నెలల క్రితమే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా పూర్తి అయ్యింది. వైష్ణవ్ తేజ్ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి కరోనా కేసులు విపరీతంగా పెరిగినా కూడా క్రిష్ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సినిమాను పూర్తి చేశాడు. పూర్తిగా అటవి ప్రాంతంలో ఉండే ఈ సినిమా ను కొండ పొలం అనే ఒక ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. వీరిద్దరి మద్య సినిమాలో ఎలాంటి సంబంధం ఉంటుంది.. ఇద్దరు మద్య లవ్ కమ్ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను క్రిష్ తన సన్నిహితులతో హోమ్ బ్యానర్ లో నిర్మించాడు. ఓటీటీ కోసం ఈ సినిమాను నిర్మించినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు విడుదల చేయక పోవడం వల్ల సినిమాను థియేటర్ల ద్వారానే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చింది. తాజాగా ఈ సినిమా విషయమై మరో విషయం స్పష్టత వచ్చింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను అక్టోబర్ 8న విడుదల చేసేలా ప్లాన్ చేశారట. సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా ముగిసింది. సినిమా మొదటి కాపీ రెడీ అయ్యిందని.. కాని విడుదల కోసం మంచి సమయంను చూస్తున్న మేకర్స్ అక్టోబర్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెలలో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్ ను దర్శకుడు క్రిష్ చాలా విభిన్నంగా అందరి దృష్టిని ఆకర్షించేలా చూపించాడు. రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఈ సినిమాలో విభిన్నమైన గెటప్ లో క్రిష్ చూపించబోతున్నాడట.