ఏ దర్శకుడైన తనకు మొదటి అవకాశం ఇచ్చిన హీరోను ఎంత మాత్రం మరచిపోలేడు. ఇటీవల రచయితలు దర్శకులుగా మారుతున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్లకి కూడా తొందరగా అవకాశం అందడం లేదు. ఎన్నో సినిమాలకు పని చేసి సక్సెస్ ఫుల్ స్టోరిలను ఇచ్చినప్పటికీ నమ్మకం కుదరడం లేదు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య కథను మెచ్చి వక్కంతం వంశీకి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
తన కథకు కరెక్ట్ న్యాయం చేయడంతో రచయిత గర్వంగా దర్శకుడిగా సంతృప్తి చెందాడు. అందుకే సినిమా ఈవెంట్ లో తన కలను నెరవేర్చిన మగాడు బన్నీ అంటూ.. పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వక్కంతం వంశీపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ట్రాల్స్ రావడం మొదలయ్యాయి. ఎందుకంటే ఈ రచయితకు ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉంది. మొదట అయినతోనే సినిమా చేస్తాను అని చెప్పాడు. కానీ తారక్ ఎందువల్లనో గాని ఒప్పుకోలేదు. తారక్ కి చెప్పిన కథ నా పేరు సూర్య అని నచ్చకపోవడం వల్లనే తారక్ ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. కానీ వక్కంతం వంశీ పలు ఇంటర్వ్యూలలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి చెప్పిన కథ పూర్తిగా వేరేది అని తెలిపాడు.
ఇక మగాడు కామెంట్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. అసలు బన్నీతో ఎక్కువగా పరిచయం లేదు. కేవలం రేసు గుర్రం కథను ఇచ్చాను కాబట్టి తెలుసు. నల్లమలుపు శ్రీనివాస్ గారికి కథ చెప్పినప్పుడు బన్నీ దగ్గరికి తీసుకెళ్లడంతో వెంటనే నమ్మకం ఉంచి కథను ఒకే చేశారు. ఆ విధంగా నమ్మిన వ్యక్తి గురించి తన దృష్టితో చెప్పినట్లు దర్శకుడు వివరణ ఇచ్చాడు. జస్ట్ ఒక కామెంట్ తప్పిస్తే.. అందులో నిగూడార్దాలు లేవని అంటున్నాడు వక్కంతం వంశీ!!