'వ‌లిమై' కి థియేట‌ర్లు ఒక్క‌రోజేనా?

Update: 2022-02-18 11:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్  `వ‌లిమై` ఫిబ్ర‌వ‌రి 24న భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. కోలీవుడ్ సహా టాలీవుడ్ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తోంది. అయితే ఈసినిమా కి  తెలుగు రాష్ర్టాల్లో థియేట‌ర్లు కేవ‌లం ఒక్క‌రోజు మాత్ర‌మే బ్లాక్ చేయ‌గ‌ల‌దు.

ఫిబ్ర‌వ‌రి 24న తెలుగు సినిమా ఏది రిలీజ్ కాలేదు. కాబ‌ట్టి ఆ రోజు తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. కేవ‌లం నాలుగు షోల‌కు మాత్ర‌మే ఆ వెసులుబాటు ఉంటుంది. త‌ర్వాత మ‌రుస‌రి రోజు  ఫిబ్ర‌వ‌రి 25న వ‌రుస‌గా అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..రానా న‌టించిన `భీమ్లా నాయ‌క్`..వ‌రుణ్ తేజ్ న‌టించిన `గ‌ని`...యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు`...దీటితో పాటు `సెబాస్టియ‌న్  పీసీ 524` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

అలాగే బాలీవుడ్ చిత్రం `గంగూబాయి క‌తియావాడి` కూడా రిలీజ్ అవుతుంది. ఇలా ఇన్ని చిత్రాల న‌డుమ `వ‌లిమై` తెలుగు రాష్ర్టాల్లో రిలీజ్ అవుతుంది. కాబ‌ట్టి 24 ఒక్క రోజే `వ‌లిమై`కి వెసులుబాటు ఉంటుంది. `వ‌లిమై `థియేట‌ర్ల‌లో కొన‌సాగాలంటే అద్భుతాలే జ‌ర‌గాలి. పై చిత్రాలు  జ‌యాప‌జాల‌తో సంబంధం లేకుండా థియేట‌ర్లు కేటాయించ బ‌డ‌తాయి.

`వ‌లిమై` బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంటే కొద్దిగా వెసులుబాటు దొరికే అవ‌కాశం ఉంది. కానీ అదంత వీజీ కాదు. గ‌తంలో  కూడా అజిత్ సినిమాలు ఇలాగే రేసులో వెనుక‌బ‌డిన సంద‌ర్భాలున్నాయి.  తెలుగు రిలీజ్ స‌మ‌యం స‌వ్యంగా లేక‌పోవ‌డంతో కోలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ తెచ్చుకున్న చాలా చిత్రాలు టీవీల్లో మాత్ర‌మే స‌క్సెస్ అయ్యాయి.

ఇక `వ‌లిమై` సెన్సార్ ప‌నుల‌ను పూర్తిచేసుకుంది.  సీబీఎఫ్ సీ నుంచి U/A స‌ర్టిఫికెట్ పొందింది. `వలిమై` ర‌న్ టైమ్ 2 గంట‌ల 56 నిమిషాలు. ర‌న్ టైమ్ ఎక్కువ‌గానే ఉంది. ఇటీవ‌లి కాలంలో ఏ సినిమా నిడివి ఇంత‌గా లేదు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో క‌లిసి బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ నిర్మిస్తున్నారు.

 `ఖాకి` ద‌ర్శ‌కుడు హెచ్. వినోధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు. తెలుగు న‌టుడు కార్తికేయ గుమ్మ‌డి కొండ ఇందులో విల‌న్ గా న‌టించ‌డం విశేషం.
Tags:    

Similar News