ఇంత లెంత్ ఎందుకు వాల్మీకీ?

Update: 2019-09-11 11:01 GMT
ఇప్పటి ట్రెండ్ లో మూడు గంటల సేపు  ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టడం అంత సులభమైన విషయం కాదు. చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప మెప్పించడం జరగని పని. మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన సాహో సైతం ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది. అలా అని అందరికి ఇదే ట్రీట్మెంట్ దక్కుతుందని కాదు కానీ సరిగ్గా ప్రెజెంట్ చేస్తే లెన్త్ పెద్ద ఇబ్బందే కాదని రంగస్థలం - మహానటి - అర్జున్ రెడ్డి - మహర్షి లాంటి సినిమాలు ఋజువు చేశాయి.

ఇప్పుడు ఈ వరసలో చేరేందుకు వాల్మీకి కూడా ట్రై చేస్తోందట. విశ్వసనీయ సమాచారం మేరకు వాల్మీకి ఫైనల్ రన్ టైం 2 గంటల 51 నిమిషాలకు లాక్ అయ్యిందని తెలిసింది. ఇది చాలా పెద్ద నిడివి. అందులోనూ తమిళ రీమేక్. సపోర్టింగ్ హీరో అథర్వా మనవాళ్లకు బొత్తిగా పరిచయం లేని బాపతు. మృణాలిని కూడా అంతే. సో భారం మొత్తం వరుణ్ తేజ్ యాక్టింగ్ దర్శకుడు హరీష్ శంకర్ టేకింగ్ మీదే ఆధారపడి ఉంది. వాస్తవానికి తమిళ్ ఒరిజినల్ వెర్షన్ కూడా ఇంత లేదు. కన్నడలో ఓ పది నిముషాలు తగ్గించే తీశారు. తెలుగుకు వచ్చేటప్పటికి హరీష్ ఇంకో పది నిముషాలు జోడించడం షాక్ ఇచ్చే విషయం.

మసాలా అంశాలతో పాటు కావాల్సినంత కామెడీని అదనంగా జోడించడం వల్లే ఇంత టైం పెరిగిందని అంటున్నారు. అయితే ఇదే మైనస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాల్మీకి టీమ్ మీదే ఉంది. తాము తీసిన వర్క్ మీద మేకర్స్ కు ఎంతైనా నమ్మకం ఉండొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఆడియన్స్ పల్స్ ని జాగ్రత్తగా ఒడిసిపట్టడం చాలా అవసరం. మరి వాల్మీకి ఇంత రిస్క్ చేసి మూడు గంటల 9 నిముషాల లెన్త్ తో ఎలా ఎంటర్ టైన్ చేస్తాడో వేచి చూడాలి


Tags:    

Similar News