మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'వాల్మీకి'. తమిళ హీరో అథర్వ.. పూజా హెగ్డే ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. సరిగ్గా రెండు నిముషాల నిడివి ఉన్న ట్రైలర్ లో ఆద్యంతం హరీష్ శంకర్ తన మార్క్ చూపించాడు.
ట్రైలర్ మొదట్లో ఒక మంచి సినిమా తీస్తానంటూ తపించే డైరెక్టర్ పాత్రలో అథర్వ ఎంట్రీ ఇస్తాడు. అయితే తన కథలో డాన్ పాత్ర పోషించేందుకు ఒక నటుడు కావాలి. ఏదో ఒక యాక్టర్ ను ఎంచుకోకుండా మంచి ఫామ్ లో ఉన్న నిజం గ్యాంగ్ స్టర్ కోసం వెతుకుతాడు. అథర్వకు పాత్రకు సరిపోయే భయంకరమైన గ్యాంగ్ స్టర్ గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్) కనిపిస్తాడు. "నాపైన పందేలేస్తే గెలుస్తరు.. నాతోటి పందేలేస్తే సస్తరు" అంటూ వరుణ్ తన పాత్ర స్వభావాన్ని స్వయంగా ఒక్క ముక్కలో చెప్పేస్తాడు. వరుణ్ పాత్ర ఎలాంటిదో చెప్పే సీన్లు ట్రైలర్లో ఫుల్లుగా ఉన్నాయి. "ఏం రో.. ఏం సోచాయిస్తున్నవ్ ఏంది కత" అని చెప్పే స్టైల్ మాసు ఆడియన్స్ కు ఫుల్ కిక్కిచ్చేలా ఉంది. ఇక వరుణ్ ఆ 'ఏం రో' పదాన్ని పలికే తీరు సూపరో సూపర్. ఇక భరత్ అనే నేను సినిమాలోని మహేష్ పాపులర్ డైలాగ్ 'ఐయాం నాట్ డన్ ఎట్' అనే డైలాగ్ ను బ్రహ్మాజీ వాడుతూ ఒక పంచ్ వేస్తే.. దానికి రెస్పాన్స్ గా కూడా వరుణ్ 'ఏం రో' అంటాడు. హీరోయిన్ పూజా హెగ్డే తో రొమాన్స్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి.
ఓవరాల్ గా చూస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ సమపాళ్ళలో రంగరించిన పక్కా మాస్ ఎంటర్టైనర్ తరహాలో ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్. ఇక ట్రైలర్ మొత్తానికి ఫస్ట్ హైలైట్ వరుణ్ తేజ్ అయితే సెకండ్ హైలైట్ హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్. "గత్తర లేపినవ్.. చింపేషినవ్ పో" అనే డైలాగు ఒక మహిళా చెప్పడంతో ఎండ్ అవుతుంది. ట్రైలర్ ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే.. ఆ డైలాగే వారికి సరైన సమాధానం! ఆలస్యం ఎందుకు.. ఈ మెగా మాసు గ్యాంగ్ స్టర్ ను చూసేయండి.
Full View