ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి ఏకంగా మూడేళ్ల పాటు ఒక మీరో కోసం వేచి చూశాడంటే ఆ దర్శకుడిలో సహనం పాళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహేష్ ని ఒప్పించేందుకు చాలా కాలం వేచి చూసిన వంశీ పైడిపల్లి తన కోసం కథ రాసుకుని తనతోనే తీస్తానని పట్టు పట్టి మరీ వేచి చూశారు. చివరికి ఆ కల ఫలించి ఇప్పుడు సినిమా పూర్తయింది. మే 9న రిలీజవుతోంది. ఈ సినిమా జయాపజయాల మాటేమో గానీ.. ఇప్పటికే టీమ్ ప్రీరిలీజ్ వేడుకలో ఎంతో ఎమోషన్ అవ్వడం కనిపించింది. సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టి పని చేశారో ఈవెంట్ వీక్షకులకు అర్థమైంది.
ఈ వేదికపై వంశీ పైడిపల్లి ఎంతో ఎమోషనల్ స్పీచ్ ని ఇచ్చారు. మూడేళ్ల తర్వాత స్టేజీ ఎక్కాను.. మాట్లాడేది చాలా ఉంది అంటూ తాపీగా చాలా విషయాల్నే ముచ్చటించారు వంశీ. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ``హైదరాబాద్‌లో పుట్టి పెరిగి టికెట్స్ కోసం ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో దెబ్బలు తిని సినిమాలు చూసి హీరో ఇంట్రడక్షన్‌కి పేపర్స్ విసిరిన వారిలో నేను ఒకడిని. ఒక ఆడియెన్ టికెట్ కొన్నప్పుడు ఏం కోరుకుంటారో నాకు తెలుసు. సూపర్‌స్టార్ మహేష్ ఫోటో ఉంటే సినిమాలో ఏం ఉండాలని కోరుకుంటారో నాకు తెలుసు. ఒక్కడు సినిమా నా ముందు మహేష్‌గారు సినిమా చూస్తున్నారు. ఈరోజు ఆయన్ని డైరెక్ట్ చేయడమే ఓ జర్నీ. గతంలో నేను ఎక్కడున్నా.. ఇప్పుడు ఎక్కడున్నాననేదే జర్నీ. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను`` అని అన్నారు.
మహర్షి కథ కోసం శ్రమించిన వారిని పరిచయం చేస్తూ.. ఈ కథకు సంబంధించి హరి, సాల్మన్ ఎప్పుడో బీజం వేశారు. ఊపిరి చేసేటప్పుడు వాళ్లు చెప్పిన క్యారెక్టర్ ఎందుకో నాకు బాగా ఎక్కేసింది. తర్వాత నేను హరి, సాల్మన్ కలసి కథను తయారు చేశాం. హరిగారు నాకు దేవుడిచ్చిన సోదరుడు. పర్సనల్‌గా, ప్రొఫెషపనల్‌గా నా చెయ్యి పట్టుకుని నడిపించారు.. అని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ మోహనన్ గురించి మాట్లాడుతూ.. ఆయన షారూక్‌తో డాన్ చేశారు. తర్వాత అమీర్ తో తలాష్ చేశారు. మొన్న అంధాదూన్ చేశారు. అలాంటి సెలబ్రిటీ సినిమాటోగ్రాఫర్‌తో ఈ సినిమాకు పనిచేశాను. ఆయన ఈ సినిమాకు ఏంజెల్. ఆయన అందించిన సపోర్ట్‌కి థాంక్స్ అని అన్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు పెద్ద బలం. 16 ఏళ్ల క్రితం వర్షం సినిమాకు నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇక్కడి వరకు వచ్చింది. ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ అందించారు. నిర్మాతలు దిల్ రాజు గారికి - దత్తు గారికి - పివిపి అన్నకు థాంక్స్. మే 9న ఎప్పుడో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూసి.. సినిమా అంటే పిచ్చి పుట్టింది.మళ్లీ మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకునే రోజుగా మే 9 నిలవనుంది. అది సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుని తిరిగే రోజని చెబుతున్నాను. మహేష్ స్టార్‌గానే సూపర్‌స్టార్ కాదు.. హ్యుమన్ బీయింగ్‌గా కూడా సూపర్‌స్టారే అని అన్నారు.