''అఖిల్'' సినిమా విడుదలై ఆర్నెల్లయ్యింది. ఆ తరువాత అఖిల్ బాబు ఇంకో సినిమాకు సైన్ చేస్తే ఒట్టు. చాలామంది పేర్లు వినిపించినా కూడా.. ఎందుకో ఏ ఒక్క దర్శకుడితోనూ సెట్టవ్వలేదు. పైగా స్వయంగా కింగ్ నాగార్జునే ఇప్పుడు కథలు విని నిర్ణయం తీసుకుంటారు అని చెప్పినా కూడా.. ఒక్క సినిమా కూడా మొదలవ్వలేదు.
రాక రాక వచ్చిన ఎడారిలో మల్లెల వాన అన్నట్లు.. సడన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి కథను నాగార్జున అండ్ అఖిల్ ఓకె చేసినట్లు టాక్ వచ్చింది. అయితే నాగ్ ను ''ఊపిరి'' సినిమాలో డైరెక్టు చేసిన దర్శకుడే కాబట్టి.. అందరూ వంశీ సినిమా పక్కా అని కూడా ఫిక్సయ్యారు. అయితే ఏమైందో ఏంటే తెలియదు కాని.. దర్శకుడు వంశీ మాత్రం ఈరోజు ఒక విభిన్నమైన స్టేట్ మెంట్ ఇచ్చాడు.
''అబ్బే కేవలం టాక్స్ జరుగుతున్నాయి అంతే. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. అఖిల్ తో చేస్తానా.. ఇంకెవరితోనైనా చేస్తానా అనే విషయం తెలియదు. కాకపోతే ఊపిరి రిలీజయ్యేవరకు నేను ఏ విషయంపైనా నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదు. ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ హడావుడి పూర్తయ్యాక.. మీకు నా కొత్త సినిమా గురించి క్లారిటీ ఇస్తాను'' అన్నాడు. చూస్తుంటే మనోడు అఖిల్ కు హ్యాండిస్తున్నాడా అని అనిపించట్లేదూ?