కొద్ది కాలం క్రితం విలక్షణ దర్శకుడు వంశీ తెరకెక్కించిన 'ఫ్యాషన్ డిజైనర్' .. సన్నాఫ్ లేడీస్ టైలర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వంశీ మార్క్ కథ - కథనం ఉన్నప్పటికీ ....ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వంశీ విఫలమయ్యారు. నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటైన `లేడీస్ టైలర్` చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. దీంతో, ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, ఆ సినిమాలో నటించడం ఇష్టం లేదని వంశీతో రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు పుకార్లు వచ్చాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం వాస్తవమేనని వంశీ తెలిపారు. ఆ ప్రతిపాదనను రాజేంద్రప్రసాద్ తిరస్కరించడానికి గల కారణాలను వెల్లడించారు.
ఆ సినిమాలో నటించడం తనకిష్టం లేదని తన మేనేజర్ తో రాజేంద్ర ప్రసాద్ కబురు చేశారని వంశీ చెప్పారు. 'లేడీస్ టైలర్` వంటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయడం తనకిష్టం లేదని రాజేంద్రప్రసాద్ అన్నారని, ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకించడానికి తనకు హక్కు లేదని చెప్పారు. మొదటి నుంచి తనకు చాలా తక్కువ మంది స్నేహితులున్నారని, దానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవన్నారు. తన మనసులోని విషయాలను ఎవరితోనూ పంచుకోవడం ఇష్టం లేకనో, మరేదో కారణం చేతనో తనకు పెద్దగా స్నేహితులు లేరని తెలిపారు. ఖాళీ సమయాల్లో ఒంటరిగా తిరుగుతానని, ఆ సమయంలో ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే కోపం వచ్చేదని చెప్పారు. తాను ఫోన్ చాలా తక్కువ వాడుతుంటానని, రోజుకి రెండు .. మూడు కాల్స్ కూడా రావని, తాను కూడా ఎవరికీ పెద్దగా ఫోన్ చేయనని చెప్పారు. గతంతో పోలిస్తే ఇపుడు కోపం తగ్గిందని అన్నారు.